Movie News

గాడ్‌ఫాద‌ర్ ప్లానింగ్ బాగుండుంటే..


గాడ్‌ఫాద‌ర్ విడుద‌ల‌కు ముందు మీడియాలో ఈ సినిమా ప్ర‌మోష‌న్లు, రిలీజ్ ప్లానింగ్ స‌రిగా లేవంటూ వార్త‌లు రావ‌డం ప‌ట్ల తాజాగా నిర్వ‌హించిన స‌క్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో, ఎలా రిలీజ్ చేసుకోవాలో త‌మ‌కు తెలియ‌దా, మీడియా ఇలా వార్త‌లు రాయ‌డం ఏంటి అన్న‌ట్లుగా ఆయ‌న మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో థియేట్రిక‌ల్ ర‌న్ చాలా త‌క్కువ రో్జుల‌కు ప‌రిమితం అయిపోయి, తొలి వీకెండ్ వ‌సూళ్లు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్లు, రిలీజ్ ప్లానింగ్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. సినిమాకు హైప్ తీసుకురావ‌డం చాలా ముఖ్యం. ఇదే విష‌యంలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ మీడియాలో వార్త‌లు రావ‌డం చిరుకు త‌ప్పుగా అనిపించడం విడ్డూరం.

గాడ్‌ఫాద‌ర్ మీద చిరు టీంకు ఎంత న‌మ్మ‌కం ఉన్నా స‌రే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు, రిలీజ్ ప్లానింగ్ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేద‌న్న‌ది వాస్త‌వం. ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ద‌స‌రా సీజ‌న్లో ఇంకా ఎక్కువ వ‌సూళ్లే రాబ‌ట్టాల్సింది.

గాడ్‌ఫాద‌ర్ టీం రిలీజ్ ప్లానింగ్ ఎంత పూర్‌గా ఉందో చెప్ప‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. తెలుగు సినిమాలు మంచి క్రేజ్ మ‌ధ్య రిలీజ‌య్యే చెన్నైలో అస‌లీ సినిమా గ‌త వారం విడుద‌లే కాలేదు. వారం లేటుగా ఈ గురువారం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యుఎస్‌లో లొకేష‌న్లు, షోలు ఖ‌రారు చేయ‌డంలో, ప్రిమియ‌ర్స్ ప్లానింగ్‌, ప్ర‌మోష‌న్ల‌లో చాలా ఆల‌స్యం జ‌రిగింది. దీని వ‌ల్ల తొలి వారాంతంలో ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ మూవీకి ఎంత వ‌సూళ్లు వ‌చ్చాయో గాడ్‌ఫాద‌ర్ లాంటి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీకి కూడా అంతే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.

తెలుగు సినిమాల‌కు మంచి వ‌సూళ్లు వ‌చ్చే ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు స‌రైన స‌మ‌యంలో సెన్సార్ చేయించ‌లేక‌పోయారు. రిలీజ్ ప్లానింగ్‌లో పూర్తిగా తేలిపోయారు. దీంతో అక్క‌డ నామ‌మాత్రంగా సినిమా రిలీజైంది. వ‌సూళ్లు కూడా అందుకు త‌గ్గ‌ట్లే ఉన్నాయి. ఇలా ఇన్ని లోపాలు ఉండ‌బ‌ట్టే గాడ్‌ఫాద‌ర్ ఇంకా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. లేదంటే ఈపాటికి బ‌య్య‌ర్లు సేఫ్ జోన్లోకి వ‌చ్చేసేవారు.

This post was last modified on October 10, 2022 10:50 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago