మెగాస్టార్ వాడకం మాములుగా లేదు!

సోషల్ మీడియాకి చాలా లేట్ గా పరిచయం అయినా కానీ చిరంజీవి చాలా ఈజీగా ట్రెండ్ పట్టేశారు. ట్వీట్స్ ఎలా పెడితే ఎంటర్టైనింగ్ గా ఉంటాయో, ఏ విధంగా రెస్పాండ్ అయితే ఫాలోయర్స్ కి నచ్చుతుందో చిరంజీవి చాలా త్వరగా తెలుసుకున్నారు. తెలుగు సినిమా సెలబ్రిటీస్ లో అలా సరదాగా సమయస్ఫూర్తితో ట్వీట్స్ వేసే వాళ్ళు అరుదు.

బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఆ చాతుర్యం చూపిస్తుంటాడు. తెలుగు సినిమా వాళ్ళు ఎక్కువగా హుందాతనం ప్రిఫర్ చేస్తుంటారు. కానీ చిరంజీవి తెరపై ఎలా ఎంటర్టైన్ చేస్తారో ట్విట్టర్ వేదికపై కూడా తన స్టైల్ చూపిస్తున్నారు. మగవాళ్ళు కూడా ఇంటి పనుల్లో సాయపడాలి అంటూ సినిమా వాళ్ళు ప్రస్తుతం ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా చిరంజీవిని ఎన్టీఆర్ నామినేట్ చేస్తే దానికి బదులుగా ఛాలెంజ్ సినిమాలోని గిఫ్ పెట్టి చిరంజీవి అందరిని ఆకట్టుకున్నారు. చరణ్, పవన్ బాగా రిజర్వుడుగా ట్వీట్స్ వేస్తుంటారు కానీ జనం కనెక్ట్ అయ్యేలా ట్వీట్ చేస్తోంది మాత్రం చిరంజీవి ఒక్కరే.