గోవా బీచ్ లో నిహారిక కొణిదెల రొమాన్స్!

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల ఇప్పటికి పలు ప్రయత్నాలు చేసింది కానీ సక్సెస్ రాలేదు. అయితే ఇంకా ఆమెకి నటనపై మోజు తీరలేదు. పెళ్లయ్యాక ఎలాగో నటించే వీలుండదు కనుక ఇప్పుడే ఎన్ని సినిమాలైతే అన్ని చేసేద్దాం అని చూస్తోంది.

ఇంతవరకు వెండితెరపై గ్లామరస్ గా కనిపించని నిహారిక త్వరలో అలాక్కూడా కనిపిస్తా అంటోంది. ఆమె నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నిహారిక గ్లామర్ పాత్రనే చేస్తోందట. అదో రొమాంటిక్ చిత్రమని, గోవా బీచ్ లో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని నిహారిక చెప్పింది.

ప్రస్తుతం లాక్ డౌన్ కనుక నిహారిక ఇంట్లోనే ఉంటోంది. మళ్ళీ షూటింగ్స్ మొదలైతే బిజీ లైఫ్ అంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ తనని గ్లామర్ కోణంలో చూడడం లేదనేమో నిహారిక తమిళ చిత్ర సీమలో ఆ ప్రయత్నం చేస్తోంది.