సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇప్పుడు బ్రతికున్నట్టయితే అతని సినిమా దిల్ బేచారా ట్రైలర్ ని ఎంత మంది చూసేవాళ్ళో, అసలు ఆ సినిమా ఒకటి వస్తుందని ఎంతమంది పట్టించుకునేవాళ్ళో కానీ… ఆత్మహత్య చేసుకున్న తర్వాత పబ్లిక్ సింపతీ చూరగొన్న సుశాంత్ కొత్త సినిమా ట్రైలర్ ని జనం ఎగబడి చూస్తున్నారు.
ఒక్కరోజులోనే దాదాపు మూడు కోట్ల యాభై లక్షల వ్యూస్ రాబట్టిన ఆ ట్రైలర్ కి డెబ్భై లక్షల వరకు లైక్స్ కూడా వచ్చాయి. బాలీవుడ్ టాప్ హీరోలకు మాత్రమే ఇలాంటి స్పందన లభిస్తుంది.
సుశాంత్ పట్ల జనంలో ఎంత సానుభూతి ఉందనేది దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా యిలాగే చూస్తారని డిస్నీ హాట్ స్టార్ ఆశిస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం సుబ్స్క్రైబర్స్ కి మాత్రమే కాకుండా ఫ్రీగా వీక్షించేందుకు హాట్ స్టార్ ఈ నెల 24 నుంచి స్ట్రీమ్ చేస్తుంది.
ఫ్రీ కనుక ఈ చిత్రాన్ని మాములుగా కంటే పెద్ద సంఖ్యలో చూసే అవకాశం ఉంది. సింపతీ ఉంటుంది కనుక ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చే అవకాశం తక్కువే కనుక దిల్ బేచారా ఓటిటి రికార్డుల లాంటివి సాధించినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on July 7, 2020 10:42 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…