చిరంజీవి అల్లుడికి అది సరిపోదంట!

లో బడ్జెట్ సినిమాలను థియేటర్లలో విడుదల చేసే పరిస్థితులు అస్సలు లేవిపుడు. ఒకవేళ సినిమా థియేటర్లు ఓపెన్ అయినా కానీ పెద్ద సినిమాలే చాలా వరకు క్యూలో ఉన్నాయి. అందులోను ప్రేక్షకులు కూడా ఏదైనా క్రేజీ సినిమా అయితే తప్ప థియేటర్ వరకు వెళ్లే సీన్ ఉండదు. అందుకే చిన్న సినిమాలను ఓటిటిలో విడుదల చేసేయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.

అయితే తన సినిమాను అలా ఓటిటిలో రిలీజ్ చేయడానికి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఒప్పుకోవడం లేదట. సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ లాక్ డౌన్ నిబంధనలు సడలించగానే షూటింగ్ మొదలు పెడితే ఓటిటి రిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నాడని అనుకున్నారు. కానీ కమర్షియల్ స్టార్ అవ్వాలని చూస్తున్న కళ్యాణ్ దేవ్ ఓటిటి వేదిక తనకు చాలదని భావిస్తున్నాడు.

మొదటి సినిమా విజేతకు పోస్టర్ ఖర్చులు కూడా రాకపోయినా కానీ చిరు అభిమానులు తనను ఆదరిస్తారని, తాను మంచి హీరో మెటీరియల్ అని కళ్యాణ్ దేవ్ బలంగా నమ్ముతున్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కానీ నో కాంప్రమైజ్ అంటున్నాడని గుసగుసలాడుకుంటున్నారు.