షారుఖ్ దొరికిపోయాడే..


వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత స్టార్ హీరోలందరూ ఫిజిక్ మీద దృష్టిపెడుతున్నారు. ఒకప్పటి హీరోల్లాగా భారీగా పొట్టలేసుకుని, శరీరాకృతి గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తే ఇప్పటి ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టే అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వాళ్లు ఈ వయసులోనూ తెర మీద ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారో తెలిసిందే.

50ల్లో ఉన్న బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇప్పుడు కూడా కండలు తిరిగిన దేహంతో, సిక్స్ ప్యాక్స్‌తో ఔరా అనిపిస్తున్నారు. సల్మాన్ ఎప్పుడూ ప్యాక్స్‌తోనే కనిపిస్తుంటాడన్న సంగతి తెలిసందే. ఐతే ఇటీవల షారుఖ్ ఖాన్ అతణ్ని మించి పర్ఫెక్ట్ బాడీలోకి వచ్చాడు పఠాన్ సినిమా కోసం. ఈ సినిమాకు సంబంధించి ప్రతి లుక్‌లోనూ షారుఖ్ ఔరా అనిపిస్తున్నాడు.

తాజాగా షారుఖ్ తన షర్ట్ లెస్ ఫొటో ఒకటి రిలీజ్ చేశాడు. 56 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ కాదు.. అంతకుమించిన బాడీతో షారుఖ్ అందరినీ విస్మయానికి గురి చేశాడు. పొట్ట భాగంలోనే కాక సైడ్స్‌‌లో కూడా ప్యాక్స్‌తో ఔరా అనిపించాడు షారుఖ్. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐతే అది ఒరిజినల్ కాదంటూ నెటిజన్లు షారుఖ్‌ను ట్రోల్ చేస్తున్నారిప్పుడు.

ఈ లుక్ ‘పఠాన్’ సినిమాలోనిది కాగా.. కాస్త అటు ఇటుగా ఇదే టైంలో రిలీజ్ చేసిన మరో లుక్‌లో షారుఖ్ ప్యాక్స్ కొంచెం భిన్నంగా ఉన్నాయి. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. షారుఖ్ అసలు కష్టపడలేదని, ప్యాక్స్ చేయలేదని కాదు కానీ.. అతడి కష్టానికి తోడు ఫొటో షాప్ శ్రమ కూడా తోడైనట్లు ఉందని.. అందుకే ఈ వేరియేషన్ అని అంటున్నారు నెటిజన్లు. ఐతే షారుఖ్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ తమ హీరో ఈ వయసులో పడ్డ కష్టాన్ని గుర్తించమంటున్నారు.