Movie News

పదకొండు నెలల్లో 4 సూపర్ హిట్లు

తండ్రి మమ్ముట్టి మలయాళంలో పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ ఆయన చూపిన కమర్షియల్ బాట కాకుండా తనదంటూ ఓ విభిన్న శైలిని అలవరుచుకుని అద్భుత ఫలితాలను సాధిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఒకపక్క స్వంత భాషలో ఏడాదికో హిట్టు దక్కితే చాలని ఇప్పటి జెనరేషన్ హీరోలు కోరుకుంటే ఇతను మాత్రం నో లాంగ్వేజ్ బారియర్ అంటూ కథ నచ్చితే చాలు ఎంత రిస్క్ అయినా ఎంత దూరమైనా సరే రెడీ అంటున్నాడు. ఒకవేళ సదరు బాష రాకపోతే నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు తప్ప ఇంకొకరి గాత్రంలో తన పెర్ఫార్మన్స్ ని రిస్క్ లో పెట్టేందుకు సిద్ధపడటం లేదు.

ఇక విషయానికి వస్తే ఈ 2022లో దుల్కర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ప్యాన్ ఇండియా అంటూ ఒకే సినిమాతో కాకుండా నాలుగు వేర్వేరు భాషల్లో నటించి అందులోనూ హిట్లు సాధించి మిగిలినవాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ముందుగా తెలుగులో చూస్తే ‘సీతారామం’తో ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి ఏకంగా వంద కోట్ల గ్రాసర్ టాలీవుడ్ ఖాతాలో వేసేందుకు పరుగులు పెడుతున్నాడు. ఇటీవలే హిందీలో విడుదలైన ‘చుప్ రివెంజ్ అఫ్ ఆర్టిస్ట్’లో నటనకు విమర్శల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆశీర్వాదం కూడా దక్కినట్టు వసూళ్లు చెబుతున్నాయి.

మలయాళంలో చూస్తే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకున్న ‘సెల్యూట్’కి సోనీ లివ్ లో భారీ వ్యూయర్ షిప్ దక్కింది. అంతకు ముందు ‘కురుప్’ ఏ స్థాయిలో థియేట్రికల్ హిట్టో తెలిసిందే. తమిళంలో చేసిన ‘హే సినామిక’ అక్కడ పర్వాలేదనిపించుకుంది కానీ మరీ తన స్థాయిలో అయితే కాదు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా కాలాన్ని లెక్కేసుకుంటే కేవలం పదకొండు నెలల గ్యాప్ లో ఇన్ని సినిమాలు, మైలురాళ్ళు అందుకోవడం ఒక్క దుల్కర్ కే సాధ్యమయ్యింది. తన గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఒకటే. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో, కథల ఎంపిక ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు

This post was last modified on September 25, 2022 1:26 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago