చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమంతా శాకుంతలం రిలీజ్ డేట్ ఇవాళ అఫీషియల్ గా నవంబర్ 4ని ప్రకటించారు. రుద్రమదేవి తరువాత దర్శకుడు గుణశేఖర్ చాలా గ్యాప్ తీసుకుని తనే నిర్మాతగా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎక్కువగా తెరకెక్కిన దుశ్యంతుడు శాకుంతల కథను ఇంత పెద్ద స్కేల్ లో తెరకెక్కించడం ఇదే మొదటిసారి. షూటింగ్ అయితే వేగంగానే చేశారు కానీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్స్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ గ్రాండియర్ కు మణిశర్మ సంగీతం సమకూర్చారు.
ఇందులోనే అల్లు అర్జున్ గారాల పట్టి అర్హను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అల్లు శిరీష్ తో క్లాష్ ఏంటనుకుంటున్నారా. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రేమ కాదంట(టైటిల్ మారొచ్చు) ను కూడా అదే డేట్ కి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలిసింది. అర్హ కోణంలో చూస్తే తన డెబ్యూ మూవీతోనే బాబాయ్ తో పోటీ పడాలన్న మాట. ప్రేమ కాదంటలో అను ఇమ్మానియేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించారు. కెరీర్ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాలేని టైంలో శిరీష్ రిస్క్ చేస్తున్నాడు.
ఇది తమిళ సూపర్ హిట్ ప్యార్ ప్రేమ కాదల్ కు అఫీషియల్ రీమేక్. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అయినప్పటికీ ఇంత విపరీతమైన జాప్యం ఎందుకో అంతుచిక్కలేదు. శాకుంతలంని దీంతో పోల్చడం సరికాదు కానీ శిరీష్ ఏదో సోలోగా వచ్చినా బాగుండేదేమో. అన్నయ్యేమో ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయితే తమ్ముడు ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటేసినా ఇప్పటికీ కనీస మార్కెట్ ఏర్పడలేదు. మారుతీ, విఐ ఆనంద్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా హిట్ ఇవ్వలేకపోయారు. మరి సమంతాను ఢీ కొట్టేందుకు అల్లు హీరో రెడీ అవుతాడా లేదా అధికారిక ప్రకటన వచ్చే దాకా చూద్దాం.
This post was last modified on September 23, 2022 3:08 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…