అల్లు అర్జున్ చింత తీర్చేసాడు!

దేవిశ్రీప్రసాద్ ఇటీవలి ట్రాక్ రికార్డు అంత బాలేక పోవడంతో పుష్ప చిత్రానికి తమన్ ని పెట్టుకుందామని అల్లు అర్జున్ చెప్పినా కానీ, దేవితో తనకున్న అనుబంధంతో సుకుమార్ అందుకు ఒప్పుకోలేదు. తన సినిమాలకు ఎప్పుడూ సూపర్ మ్యూజిక్ ఇచ్చే దేవిని సుకుమార్ ఎలా శంకిస్తాడు. తన మీద నమ్మకం ఉంచి దేవిని పెట్టుకుందామని సుకుమార్ చెప్పడంతో బన్నీ కాదనలేకపోయాడు. ఇక లాక్ డౌన్ వల్ల దేవిశ్రీప్రసాద్ కి ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేసుకునే వీలు చిక్కింది.

సుకుమార్ కి కూడా షూటింగ్ లేకపోవడంతో తనకెప్పుడూ టచ్ లోనే ఉన్నాడు. జూమ్, గూగుల్ మీట్ ద్వారా ఇద్దరూ మ్యూజిక్ సిట్టింగ్స్ వేసుకుని పుష్ప కు అవసరం అయినా ట్యూన్స్ ఫిక్స్ చేసేసుకున్నారు. వీటిలో రెండు, మూడు రఫ్ ట్యూన్స్ అల్లు అర్జున్ కూడా విన్నాడట. ఈ అవుట్ పుట్ తో అల్లు అర్జున్ కి ఈ సినిమా మ్యూజిక్ మీద ఉన్న చింత తొలగిపోయిందట. పుష్ప ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా సిద్ధం చేసేసుకుంటున్నారు. షూటింగ్ స్టార్ట్ అయితే ఇక ఆగాల్సిన పని లేకుండా రెడీ అవుతున్నారు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content