నేషనల్ సినిమా డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ ప్లెక్సుల్లో, ఇందులో పాలు పంచుకునే థియేటర్లలో కేవలం 75 రూపాయలకే టికెట్లు అమ్ముతామని సదరు అసోసియేషన్ ప్రకటించిన సంగతి మూవీ లవర్స్ మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నారు. ముందు సెప్టెంబర్ 16 అన్నారు. తర్వాత ఏవో కారణాలు చెప్పి 23కి వాయిదా వేశారు. బ్రహ్మాస్త్ర రెవిన్యూ కోసమే ఇలా చేశారన్న కామెంట్లు వచ్చినప్పటికీ దాని మీద పెద్ద డిబేట్ ఏం జరగలేదు. పోన్లే అది కాకుండా వేరేవైనా ఆ రోజు చూసి ఎంజాయ్ చేద్దామని ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇక్కడే ట్విస్టు వచ్చింది.
మాములుగా అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం కొత్త పాత తేడా లేకుండా అన్ని మూవీస్ కి ఈ ఆఫర్ వర్తింపజేయాలి. కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఆ రోజు రిలీజవుతున్న నాగ శౌర్య కృష్ణ వృందా విహారికి హైదరాబాద్ ఏఎంబిలో రెగ్యులర్ ప్రైజ్ 295 రూపాయలు ఉంచారు. ఇది ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంలో ఉన్న విషయం తెలిసిందే. నేషనల్ మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఉంది. శ్రీసింహ దొంగలొస్తున్నారు జాగ్రత్తకు సైతం ఉప్పల్ ఏషియన్ లో ఎప్పుడూ ఉండే 150 రూపాయలు ఫిక్స్ చేశారు. ఇవన్నీ బుక్ మై షోలో ఉన్నాయి.
మరి 75 రూపీస్ ఆఫర్ ఉత్తిదేనా అనే అనుమానం పబ్లిక్ లో కలుగుతోంది. ఒకవేళ కొత్త సినిమాలకు వర్తించదనుకుంటే అదేదో ముందే చెప్పాల్సిందంటున్నారు. 4000 స్క్రీన్లలో ఈ సౌకర్యం ఇస్తామని అంతగా పబ్లిసిటీ ఇచ్చి తీరా ఇప్పుడీ రేట్లేంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. మరి మర్చిపోయి యధాలాపంగా ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టారో లేక నిబంధనలు సవరించి ఇప్పుడు కొత్త రూల్ పెట్టామని సమర్ధించుకుంటారో వేచి చూడాలి. నిజానికి చిన్న సినిమాలు వచ్చినప్పుడు టాక్ తో సంబంధం లేకుండా ఇలాంటి ఆఫర్లు చాలా మేలు చేస్తాయి. ఏదైనా సవరణ ఉంటుందో ఏమో లెట్ వెయిట్ అండ్ సీ
This post was last modified on September 18, 2022 6:34 am
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అభిమానులకు కొత్తగా చెప్పేందుకు ఏం లేదు కానీ పబ్లిక్…