అభిమానులు నిట్రో స్టార్ అని పిలుచుకునే సుధీర్ బాబు కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి థియేటర్లలోకి వచ్చేసింది. శ్రీదేవి సోడా సెంటర్ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో దీని మీదే ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే టీమ్ కూడా ప్రమోషన్లు ఘనంగా చేసింది. కానీ టాక్ డివైడ్ గానే ఉంది. సమ్మోహనం స్థాయిలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మేజిక్ చేయలేకపోయారనే కామెంట్స్ బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ట్రేడ్ ని కొంత టెన్షన్ పెట్టిన వాస్తవం.
ఇదిలా ఉండగా ఈ మూవీలో ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ నే తీసుకున్న ఇంద్రగంటి పరిశ్రమ మీద, ప్రస్తుత పోకడ మీద కొన్ని డైరెక్ట్ సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో హీరో పాత్ర పేరు నవీన్. వరసగా ఆరు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. మొదటి మగాడు, కసక్ లాంటి చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో బ్లాక్ బస్టర్లు కొట్టుంటాడు. హీరోయిన్ తో సహా జనం వీటిని తిట్టుకుంటారు. అయినా డబ్బులొచ్చి నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు. కమర్షియల్ సక్సెస్ సాధించాడు కాబట్టి ప్రొడ్యూసర్లు కథలు వినకుండా మరీ అడ్వాన్స్ లు ఇచ్చేందుకు రెడీ అవుతారు.
ఇది ఎవరి గురించో నేరుగా ప్రస్తావించలేదు కానీ ఓ యవ దర్శకుడిని టార్గెట్ చేసినట్టుగా సోషల్ మీడియా భాష్యం చెబుతోంది. ఇలా ఫెయిల్యూర్ చూడకుండా మసాలా సినిమాలతో కెరీర్ లో పెద్ద స్థాయికి వెళ్లిన వాళ్లకు ఓ చురక వేశారని అంటున్నారు. అంతేకాదు వెబ్ సైట్స్ మీద వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగ్ సైతం ఏదో లక్ష్యంగా రాసిన వ్యంగ్య ధోరణి కనిపించింది. మొత్తానికి ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సున్నితమైన అంశాలను మాత్రమే స్పృశించే ఇంద్రగంటి ఈసారి గేర్ మార్చి ఇలా కొత్త రూట్ లో వెళ్లడం ఆశ్చర్యం. స్టార్ల సతీమణులపై వేసిన కౌంటర్ ఆల్రెడీ ట్రైలర్ లో వచ్చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 17, 2022 6:15 am
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…