మొత్తానికి బ్రహ్మాస్త్ర అనేక అడ్డంకులను దాటి బాక్సాఫీస్ పరీక్షను విజయవంతంగా దాటేసేలాగే కనిపిస్తోంది. విడుదలకు ముందు ఉన్న నెగెటివిటీ చూస్తే.. ఈ సినిమా కచ్చితంగా బోల్తా కొడుతుందనే అనిపించింది. అందులోనూ ఈ చిత్రానికి మరీ పాజిటివ్ టాక్ కూడా రాలేదు. కానీ సినిమా తొలి వారాంతంలో హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రం ఆల్రెడీ లాభాల బాట పట్టింది. హిందీలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కొంచెం కష్టపడాల్సిందే. కాకపోతే వచ్చే రెండు వారాల్లో ఏ భారీ చిత్రం రాకపోవడం దీనికి అడ్వాంటేజ్. మరి ఫుల్ రన్లో సినిమా సక్సెస్ ఫుల్ అనిపించుకుంటుందేమో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే బ్రహ్మాస్త్ర చూసిన వాళ్లందరికీ దీని సీక్వెల్ పట్ల ఆసక్తి నెలకొంది.
బ్రహ్మాస్త్రను మూడు భాగాలుగా తీయబోతున్నట్లు ముందే ప్రకటించారు. తొలి భాగానికి శివ అని పేరు పెట్టారు. అది రణబీర్ కపూర్ పాత్ర పేరు. పార్ట్-1లో కథ మొత్తం కూడా అతడి చుట్టూనే తిరుగుతుంది. పార్ట్-2 గురించి ఇందులోనే హింట్ ఇచ్చేశారు. దానికి టైటిల్.. దేవ్. సినిమాలో అది రణబీర్ తండ్రి పాత్ర పేరు. ఆ పాత్రను గ్రాఫిక్స్ రూపంలో ఒక చిత్రమైన ఆకారంలో చూపించారే తప్ప.. ఆ వ్యక్తి ముఖం కనిపించదు. దాన్ని సస్పెన్స్ లాగా దాచారు. సెకండ్ పార్ట్ మొత్తం అతడి కథే నడుస్తుంది. మరి ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
రణబీరే ఆ పాత్రను చేస్తే మొనాటనీ రావచ్చు. సినిమాకు వైవిధ్యం చేకూరకపోవచ్చు. కాబట్టి ఆ పాత్రకు వేరే నటుడిని తీసుకునే అవకాశమే ఉంది. హృతిక్ రోషన్ లాంటివాడైతే భలే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మేకర్స్ ఆలోచన ఏంటో చూడాలి.
This post was last modified on September 13, 2022 4:55 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…