దగ్గుబాటి కల మళ్ళీ మొదటికి వచ్చింది!

తనయుడు నటుడిగా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయినా కానీ ఇంత వరకు రానా దగ్గుబాటితో పెద్ద సినిమా చేయలేదు సురేష్ బాబు. ఎప్పట్నుంచో హిరణ్య కశ్యప సినిమా చేయాలని చూస్తున్నారు.

రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఈ కథ మీదే కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కూడా పెట్టుకున్నారు. ఆమధ్య రానా ఆరోగ్య కారణాల వల్ల ఈ చిత్రం మొదలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ రానా చురుగ్గా ఉండడంతో అది చేయడానికి ఇదే తగిన సమయం అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్న సురేష్ బాబు ఇప్పట్లో అంత భారీ సినిమా తలపెట్టడం తగదని భావిస్తున్నారట.

వెంకటేష్, రాణాలతో సింపుల్ సినిమాలు తీసుకుని రెండేళ్ల తర్వాత పరిస్థితులు మాములు స్థితికి వచ్చాక అప్పుడు హిరణ్య కశ్యప చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నారట. మరి అంతవరకూ గుణశేఖర్ ఆగుతాడా లేక వేరే హీరో, నిర్మాతని వెతుక్కుంటాడా అనేది వేచి చూడాల్సిందే.