తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అసురన్’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారన్న వార్త బయటికొచ్చినపుడు చాలామంది పెదవి విరిచారు. ఇలాంటి సినిమాను తెలుగులో తీస్తే వర్కవుటవుతుందా అని సందేహాలు వ్యక్తం చేశారు. అక్కడ ధనుష్ చేసిన పాత్రకు ఇక్కడ వెంకటేష్ సూటవుతాడా అని కూడా అనుమానించారు.
అందులోనూ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతికి రీమేక్ బాధ్యతలు అప్పగించడమూ ఆశ్చర్యం కలిగించింది. మొత్తంగా చూస్తే ‘అసురన్’ను చెడగొట్టే ప్రయత్నంలా కనిపించిందిది. కానీ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు చూశాక అభిప్రాయం మారింది. ‘నారప్ప’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టి.. వెంకీని అదిరిపోయే లుక్‌లోకి మార్చి సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు. ఆ తర్వాత ‘నారప్ప’ నుంచి ప్రతి అప్ డేట్ ఆకట్టుకుంటోంది.
తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రకు తెలుగులో ప్రియమణిని తీసుకోవడమూ మంచి ఛాయిసే. ఆమె లుక్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాలో కీలకమైన హీరో పెద్ద కొడుకు పాత్రను పరిచయం చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలో భలేగా నటించి మెప్పించిన కార్తీక్ రత్నంతో ఈ పాత్ర చేయిస్తున్నారు. అతడి పాత్ర పేరు మునికన్న. అతడి లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో కీలక మలుపుకు కారణమయ్యే పాత్ర ఇది. తమిళంలో పెద్దగా గుర్తింపు లేని నటుణ్ని పెట్టారు.
తెలుగులో ఆ పాత్రకు మంచి ఆర్టిస్టునే పెట్టారు. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర అయిన హీరో చిన్న కొడుకుగా ఎవరిని ఎంచుకున్నారో చూడాలి. అలాగే హీరో బావ మరిది, విలన్ పాత్రలకు ఎవరిని పెట్టారన్నదీ ఆసక్తికరమే. లాక్ డౌన్ లేకుంటే మేలోనే ‘నారప్ప’ విడుదల కావాల్సింది. చిత్రీకరణ చివరి దశళో ఉన్న ఈ చిత్రం.. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని ఆశిస్తున్నారు.
This post was last modified on July 6, 2020 11:24 am
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…