తమిళ యువ కథానాయకుడు ధనుష్ లీడ్ రోల్ చేసిన 3 మూవీ గుర్తుందా? శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు అయింది. అప్పట్లో కొలవెరి పాట కారణంగా ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, పైగా ట్రాజిక్ ఎండ్ కావడంతో ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో 3 మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. తెలుగులో సినిమాకు భారీ నష్టాలు రావడంతో దీన్ని రిలీజ్ చేసిన నట్టి కుమార్ గొడవ గొడవ చేశాడు. ధనుష్‌తో పాటు నిర్మాతలు తనను పట్టించుకోలేదేని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడీ సినిమా గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అంటే.. ఈ నెల 12న 3 మూవీ పదో వార్షికోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో దీనికి స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో ధనుష్ పెద్ద స్టార్ కాబట్టి ఈ సినిమాకు అక్కడి జనాలు కనెక్ట్ అయి స్పెషల్ షోలు చూడడానికి ఆసక్తి చూపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగులో ధనుష్‌కు పెద్ద ఇమేజేమీ లేదు. రఘువరన్ బీటెక్ మినహాయిస్తే ఇక్కడ అతడి సినిమాలేవీ ఆడలేదు. గత కొన్నేళ్లలో అతడి క్రేజ్ మరింత తగ్గింది.
ఇలాంటి టైంలో 3 అనే డిజాస్టర్ మూవీకి స్పెషల్ షోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం.. వాటికి ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వస్తుండటం పెద్ద షాకే. హైదరాబాద్‌లో ఈ చిత్రానికి పదుల సంఖ్యలో షోలు వేస్తున్నారు. చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉండడం విశేషం. కొన్ని షోలు అయితే ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయాయి కూడా. పోకిరి, జల్సా లాంటి మన సూపర్ స్టార్ల సినిమాల కోసం ఎగబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. ఇక్కడ స్టార్ ఇమేజ్ లేని తమిళ హీరో నటించిన డిజాస్టర్ మూవీకి ఇంత క్రేజ్ ఏంటో ట్రేడ్ పండిట్లకు కూడా అంతుబట్టడం లేదు.
This post was last modified on September 8, 2022 7:14 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…