యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అతను వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నాడు. భీష్మ మినహాయిస్తే గత కొన్నేళ్లలో అతడికి సరైన విజయమే లేదు. ఆ సినిమా కూడా అన్ సీజన్లో రిలీజ్ కావడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేకపోయింది.
గత ఏడాది చెక్, రంగ్ దె చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న నితిన్.. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం రూపంలో పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ దెబ్బతో అతడి మార్కెట్ బాగా పడిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే తాను హీరోగా నటిస్తున్న చిత్రాలతో తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్న నితిన్‌కు ఈ మధ్య తన బేనర్ ద్వారా రిలీజ్ చేసిన ఓ డబ్బింగ్ సినిమా బాగా డబ్బులు తెచ్చి పెట్టింది. ఆ చిత్రమే.. విక్రమ్.
ఈ కమల్ హాసన్ మూవీని నితిన్ సొంత బేనర్ శ్రేష్ఠ్ మూవీసే రిలీజ్ చేసింది. సినిమా మీద పెట్టిన పెట్టుబడి మీద మూడింతల ఆదాయం తెచ్చిపెట్టింది విక్రమ్. ఈ సక్సెస్ నితిన్ సంస్థకు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు. కానీ అంతలోనే మాచర్ల నియోజకవర్గంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
కాగా విక్రమ్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా డబ్బింగ్ సినిమాలను తమ బేనర్ మీద రిలీజ్ చేయడానికి నితిన్ ఫ్యామిలీ డిసైడైంది. ఈ గురువారం రిలీజవుతున్న ఆర్య మూవీ కెప్టెన్‌ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది శ్రేష్ఠ్ మూవీసే. ఐతే దీనికి పెద్దగా బజ్ లేదు. విక్రమ్ లాగే రిలీజ్ తర్వాత ఇది అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. మరోవైపు గౌతమ్ మీనన్-శింబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన వెందు తనిందదు కాదు సినిమాను కూడా తెలుగులో నితిన్ సంస్థే రిలీజ్ చేయబోతోందట. ఈ చిత్రం సెప్టెంబరు 15కు షెడ్యూల్ అయింది. చూస్తుంటే నితిన్‌కు డబ్బింగ్ సినిమాలే మంచి ఆదాయ వనరుగా కనిపిస్తున్నట్లున్నాయి.
This post was last modified on September 7, 2022 6:53 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…