మొన్న పాకిస్థాన్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. ఆ టైంలో తమిళ హీరో విజయ్ విపరీతంగా ట్రోల్ అయ్యాడు సోషల్ మీడియాలో. అతణ్ని ట్రోల్ చేసింది తెలుగు నెటిజన్లే కావడం విశేషం. మరి ఇండియా మ్యాచ్ ఓడిపోతే విజయ్‌ను మన వాళ్లు ట్రోల్ చేయడమేంటి అని అడిగితే.. అందులో లాజిక్ ఏమీ లేదు. కొంత కాలంగా ఇలా ఒక కారణం అంటూ లేకుండా, సంబంధం లేని విషయాలకు ముడిపెట్టి మన నెటిజన్లు విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు.
ఐతే ఇందుకు ఒక రకంగా విజయ్ తమిళ అభిమానుల అతి కూడా ఒక కారణమే. వాళ్లు గతంలో కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు సహా కొందరు తెలుగు హీరోలను టార్గెట్ చేశారు. విజయ్ ముందు వాళ్లంతా వేస్ట్ అన్నట్లు మాట్లాడారు. ఐతే సోషల్ మీడియాలో సూపర్ స్ట్రాంగ్ అయిన మన హీరోల అభిమానులు ఊరుకుంటారా? రివర్స్ ఎటాక్‌తో విజయ్ అభిమానులకు దిమ్మదిరిగిపోయేలా చేశారు. అందులోనూ వీళ్లకు కావాల్సిన ట్రోల్ మెటీరియర్ విజయ్ చాలానే ఇచ్చాడు మరి.
విజయ్ తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేశాడు. కేవలం సినిమాలనే కాకుండా మన హీరోల పాటలు, డ్యాన్స్ మూమెంట్లు, ఫైట్లు.. ఇలా అన్నింటినీ వాడేశాడు. వాటిలో మన హీరోలతో పోలిస్తే విజయ్ తేలిపోయాడన్నది వాస్తవం. ‘పోకిరి’, ‘ఛత్రపతి’ లాంటి చిత్రాల్లో మహేష్, ప్రభాస్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పోలిస్తే విజయ్ అన్ని రకాలుగా తుస్సుమనిపించాడు. ఇవే కాక విజయ్ సినిమాల్లో చాలా సీన్లు మరీ అతిగా, నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. అతను మరీ విడ్డూరమైన ఫీట్లు చేశాడు చాలా సినిమాల్లో. మరి ఇలాంటి కంటెంట్ దొరికితే మన వాళ్లు ఊరుకుంటారా? అతణ్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ మీమ్ ఫెస్టివల్ చేస్తున్నారు.
గతంలో చేసిన అతికి బదులు అన్నట్లుగా.. సంబంధం లేని కారణాలతో అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. మొన్న ఇండియా మ్యాచ్ ఓడిపోయాక విజయ్‌ని మన నెటిజన్లు ట్రోల్ చేశారని.. అతడి ఫ్యాన్స్ మహేష్ బాబును కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీంతో మహేష్ అభిమానులు ఇంకా రెచ్చిపోయి విజయ్‌ని ట్రోల్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ వేర్వేరు హీరోల అభిమానుల మధ్య వైరం ఉంది కానీ.. విజయ్‌ని ట్రోల్ చేసే విషయానికి వచ్చేసరికి అందరూ ఒక్కటైపోతున్నారు. అందుకే ‘నేషనల్ ట్రోల్ మెటీరియల్ విజయ్’ సహా కొన్ని అబ్యూజివ్ హ్యాష్ ట్యాగ్స్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి రెండు రోజులుగా.
This post was last modified on September 6, 2022 2:16 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…