Movie News

ఆ డాక్టర్ హీరోయిన్ గురించి చెప్పాలి

సున్నితమైన కథలతో హృద్యంగా సినిమాలు తీస్తారని పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య కాస్త రూటు మారుద్దామని వయొలెంట్ గా తీసిన రివెంజ్ డ్రామా V కి ఆశించిన పేరు రాకపోవడంతో తిరిగి తన పాత స్కూల్ కే వచ్చేశారు. దీంతో పాటు సుధీర్ బాబుతో గతంలో సమ్మోహనం లాంటి ఫీల్ గుడ్ మూవీ ఇచ్చిన ఈ ఇద్దరూ మరోసారి చేతులు కలిపారు. ఈసారి టైటిల్ రోల్ లో కృతి శెట్టిని తీసుకొచ్చారు. ఇందాక మహేష్ బాబు ద్వారా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మాములుగా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని ఇంటర్వ్యూలలో చెప్పడం మనం చాలా సార్లు చూశాం. ఇంద్రగంటి సరిగ్గా ఇదే పాయింట్ ని తీసుకుని కథను అల్లేశారు. డాక్టర్ అలేఖ్య(కృతి శెట్టి)ఓ బుట్టబొమ్మ లాంటి అందమైన అమ్మాయి. ఆమెను ఎలాగైనా ఇండస్ట్రీకి తీసుకురావాలని కంకణం కట్టుకుంటాడో యువకుడు(సుధీర్ బాబు). అయితే ఆమె తల్లితండ్రులకు సినిమాలంటేనే అసహ్యం. ఎంతగా అంటే కూతురు తెరమీద కనిపిస్తే శవాలవుతామని బెదిరించేంత. మరి మూడీ మనస్తత్వానికి మారుపేరైన అలేఖ్యను ఆ కుర్రాడు ఎలా అడుగుపెట్టించాడు అనేదే కథగా ఓపెన్ చేశారు.

మొత్తానికి ట్రైలర్ ఇంటరెస్టింగ్ గానే ఉంది. వంశీ సితార, దాసరి శివరంజని తాలూకు షేడ్స్ కొన్ని కనిపిస్తున్నప్పటికీ ఇప్పటి జనరేషన్ కు సింక్ అయ్యే టేకింగ్ తో ఇంద్రగంటి ఏదో కొత్తగానే ట్రై చేశారు. సాధారణంగా పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో రూపొందే చిత్రాలకు సక్సెస్ రేట్ తక్కువ. కొన్ని మాత్రమే విజయం సాధించాయి. వరస హిట్ల తర్వాత కృతిశెట్టికి ఇటీవలే రెండు ఫ్లాపులు క్యూ కట్టాయి. ఇప్పుడు కథ మొత్తం తన చుట్టే తిరిగే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. మరి ఈ అమ్మాయి ప్రేక్షకులకు నచ్చేస్తే తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడినట్టే. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ కూల్ ఎంటర్ టైనర్ 16న విడుదల కానుంది.

This post was last modified on September 5, 2022 9:30 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago