చిరును అనుకరించబోతున్న రవితేజ?

Ravi Teja

టాలీవుడ్లో కామెడీ బాగా చేయగల మాస్ హీరోల్లో రవితేజ ఒకడు. వెంకీ, విక్రమార్కుడు, ఆంజనేయులు లాంటి సినిమాల్లో రవితేజ చేసిన అల్లరిని ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ఎంత ఫెరోషియస్ పాత్రలైనా బాగా చేసే రవితేజ.. కామెడీని కూడా అంత బాగా చేయగలడు.

ఐతే ఈ మధ్య కాలంలో రవితేజలోని ఈ బలాన్ని ఎవరూ సరిగా ఉపయోగించుకోవడం లేదు. అతను చేసిన మాస్ సినిమాలన్నీ వరుసగా తేడా కొడుతున్నాయి. ఇక వాటిలో కామెడీకి అసలే స్కోప్ ఉండట్లేదు. ఇలాంటి సమయంలో రవితేజలోని కామెడీ కోణాన్ని బాగా వాడుకునేలా ఓ కథ తయారు చేశాడట దర్శకుడు త్రినాథరావు నక్కిన. రామ్‌తో ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి హిట్ సినిమా తీసిన త్రినాథరావు.. ఆ తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. మధ్యలో కొన్ని కాంబినేషన్లు కుదిరినట్లే కుదిరి పక్కకు వెళ్లిపోయాయి.

చివరికి రవితేజతో తన తర్వాతి సినిమాను ఓకే చేయించుకున్నాడు త్రినాథరావు. వీళ్లిద్దరూ క‌లిసి చేయ‌బోయే సినిమా మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీస్‌లో ఒక‌టైన చంట‌బ్బాయి త‌ర‌హాలో ఉంటుంద‌ని స‌మాచారం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఓ కామెడీ క‌థ‌ను తీర్చిదిద్దాడ‌ట త్రినాథ‌రావు. ఆయ‌న ఆస్థాన ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న కుమారే ఈ చిత్రానికి కూడా క‌థ అందించాడు.

ర‌వితేజకు మంచి కామెడీ రోల్ ప‌డితే ఎలా చెల‌రేగిపోతాడో చాలా సినిమాల్లో చూశాం. త్రినాథ‌రావు కూడా కామెడీని పండించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడే. మ‌రి వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో రానున్న సినిమా ఎలా ఎంట‌ర్టైన్ చేస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ర‌వితేజ.. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మాస్ మ‌సాలా మూవీ క్రాక్ ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. అత‌ను ర‌మేష్ వ‌ర్మ‌తో ఇప్ప‌టికే ఓ సినిమా క‌మిటైన సంగ‌తి తెలిసిందే.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content