కరోనా లాక్ డౌన్ అయ్యాక దేశంలో వెబ్ సిరీస్ లకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు వీటిని వెబ్ లో వచ్చే టీవీ సీరియల్స్ గా భావించే వాళ్ళు క్రమంగా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమాలను తలదన్నేలా కోట్ల రూపాయల బడ్జెట్ తో కుర్చీ బిగువున కూర్చుని చూసే క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాలతో మెప్పిస్తున్న తీరు గురించి చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథమే అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992, తబ్బర్ లాంటివెన్నో ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 భారీ స్పందన దక్కించుకుంది.
ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సీజన్ 1 బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ కావడంతో దీనికి చాలా పేరు వచ్చింది. రెండో సీజన్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు ప్రేక్షకులముందుకొచ్చింది. 1990 ప్రాంతంలో కచ్చా బనియన్ అనే గ్యాంగ్ అతి దారుణంగా పౌరులను చంపుతూ దొంగతనాలు లూటీలు చేసేది.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహాలో ఒంటరిగా ఉన్న ధనవంతులైన వృద్ధులు హత్యకు గురవుతారు. ఈ కేసుని తీసుకున్న డిసిపి వర్తికా చతుర్వేది(షఫాలీ షా)కు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతాయి. చివరికి హంతకులను పట్టుకోవడమే స్టోరీ. ఎక్స్ పోలీస్ ఆఫీసర్ నీరజ్ కుమార్ రాసిన ఖాకీ ఫైల్స్ ఆధారంగా దర్శకుడు తనూజ్ చోప్రా ఢిల్లీ క్రైమ్ 2ని తెరకెక్కించారు.
మొదటి భాగంలో ఉన్నంత డెప్త్ ఇందులో లేకపోయినా ఓవరాల్ గా కాస్త ఓపికతో చూస్తే పాస్ అయ్యేలాగే సిరీస్ సాగింది. సిబ్బంది కొరత వల్ల డిపార్ట్ మెంట్ లో అంతర్గతంగా ఎదురుకుంటున్న సమస్యలను ఒకవైపు ఎత్తి చూపిస్తూనే వెనుకబడిన వర్గాలను ట్రీట్ చేసే విధానాన్ని చూపించిన విధానం బాగుంది. ఎక్కువ థ్రిల్స్, ట్విస్టులు ఆశించకుండా చూస్తే సరిపడా మలుపులతో ఫైనల్ గా ఢిల్లీ క్రైమ్ 2 పాస్ అయ్యే రేంజ్ లో సాగింది. కాకపోతే అంచనాలను పరిమితంగా పెట్టుకుంటేనే సుమా.
This post was last modified on September 2, 2022 12:08 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…