బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన అమీర్ ఖాన్.. లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడతను. ఐతే ఇటీవల తన కెరీర్లో ఎన్నడూ ఎరుగని ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడతను గత నెల 11న విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
నిజానికి ఈ సినిమా ఫలితమేంటో విడుదలకు ముందే దాదాపుగా నిర్ణయం అయిపోయిందని చెప్పాలి. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేదు. దీనికి తోడు రకరకాల కారణాల వల్ల ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సోషల్ మీడియాలో. ఆ ప్రభావం సినిమా మీద గట్టిగానే పడిందన్నది స్పష్టం. మొత్తానికి ఆమిర్ గత సినిమాలు తొలి రోజు సాధించే వసూళ్లను ఈ సినిమా ఫుల్ రన్లో రాబట్టగలిగిందంతే. ఈ ఫలితం ఆమిర్‌కు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.
సినిమా కోసం ఎంతో తపించే ఆమిర్‌కు ప్రేక్షకులకు ఇలాంటి శిక్ష వేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఐతే తన సినిమాను నిరాదరించినందుకు ఆమిర్ ఏమీ ప్రేక్షకుల మీద కోపం, అసహనం చూపించట్లేదు. వారి అంచనాలకు తగ్గ సినిమా తీయనందుకు పరోక్షంగా తనే సారీ చెప్పాడు. తాజాగా ఆమిర్ నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది. షారుఖ్ ఖాన్ సినిమా కల్ హో న హోలోని మాటలను గుర్తు చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పింది. మనందరం మనుషులమే. కాబట్టి అందరం తప్పులు చేస్తాం.
కొన్నిసార్లు మన మాటలు తప్పవుతాయి. కొన్నిసార్లు చేతలు తప్పవుతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు మనం కోపంతో ఎదుటివాళ్లను బాధ పెడతాం. కొన్నిసార్లు తమషా చేస్తూ, కొన్నిసార్లు మన మౌనంతో ఇతరులను బాధ పెడతాం. నేను కనుగ మనోభావాలను దెబ్బ తీసి ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నా.. ఇదీ ఈ పోస్టు సారాంశం. తన సినిమా పోయిన బాధను పక్కన పెట్టి ప్రేక్షకులకు సారీ చెప్పడం ఆమిర్‌కే చెల్లింది.
This post was last modified on September 2, 2022 8:14 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…