Movie News

కోబ్రా.. చేతులు కాలాక ఆకులు

ఒకప్పట్లా మూడు గంటల నిడివితో ఎక్కువగా సినిమాలు రావట్లేదు. గతంలో నిడివి అనేది సమస్యగానే ఉండేది కాదు. మూడు గంటలకు అటు ఇటు నిడివితో చాలా సినిమాలే వచ్చేవి. కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఓపిక తక్కువ. ఏ మాత్రం నిడివి ఎక్కువైనా, సినిమా సాగతీతగా అనిపించినా ‘ల్యాగ్’ అంటూ పెదవి విరిచేస్తున్నారు. నిజానికి సినిమా బాగుంటే ఎప్పుడూ కూడా లెంగ్త్ అనేది సమస్యే కాదు. కానీ సినిమా అటు ఇటుగా ఉంటే మాత్రం నిడివి అనేది ప్రస్తుతం చాలా పెద్ద సమస్య అయి కూర్చుంటోంది.

అసలే బాలేని సినిమాను అంత ఎక్కువ నిడివితో చూడాల్సి రావడం ప్రేక్షకులకు నరకమే అని చెప్పాలి. ఇప్పుడు విక్రమ్ సినిమా ‘కోబ్రా’ ఆడియన్స్‌కు అలాంటి అనుభవమే మిగిల్చింది. ఈ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు కావడం గమనార్హం. ఈ రన్ టైం చూసి విడుదలకు ముందే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ఇంత నిడివితో ఫైనల్ కట్ ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇది చాలా రిస్కీ వ్యవహారంలా కనిపించింది.

‘కోబ్రా’ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడమే కాదు.. ప్రేక్షకులకు ఒక రకంగా టార్చర్ చూపించిందనే చెప్పాలి. దర్శకులు అసలేం రాసుకున్నాడో, ఏం తీశాడో అర్థం కాని విధంగా సినిమా తయారైంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర అసలేమాత్రం కసరత్తు జరగలేదని.. తీసిందంతా అలాగే పెట్టి థియేటర్లకు వదిలేశారని అనిపించింది. అసలే సినిమా అంతంతమాత్రం అంటే.. విపరీతమైన సాగతీతగా అనిపించే హీరో ఫ్లాష్ బ్యాక్, అతడి ఊహా ప్రపంచం చుట్టూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులకు చుక్కలు చూపించేశాయి.

ఐతే తొలి రోజు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక ‘కోబ్రా’ టీం మేల్కొంది. సినిమా నిడివి ఎక్కువైందన్న కంప్లైంట్లను తాము ఆలకించామని.. సమీక్షకులు, ప్రేక్షకుల అభిప్రాయాన్ని అనుసరించి 20 నిమిషాల నిడివి తగ్గిస్తున్నామని ప్రకటించారు. కానీ ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. సినిమా రష్ చూసిన ఎవరైనా నిడివి చాలా ఎక్కువైందనే ఫీలై ఉంటారు. అప్పుడే కొంచెం జాగ్రత్త పడి లెంగ్త్ తగ్గించి ఉంటే సినిమాకు ఈ స్థాయిలో నెగెటివ్ టాక్ వచ్చేది కాదు. ఈ టాక్ తర్వాత ఏం చేసినా సినిమాను కాపాడ్డం కష్టంగానే కనిపిస్తోంది.

This post was last modified on September 1, 2022 7:11 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago