బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు మామూలు డిప్రెషన్లో లేడు. గత రెండు దశాబ్దాల్లో లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ చలన చిత్ర రికార్డులన్నింటినీ తిరగరాసి.. మన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘన చరిత్ర ఉన్న ఆమిర్‌కు ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’ రూపంలో దారుణమైన అనుభవం మిగిలింది. కేవలం 50 కోట్ల వసూళ్లకు పరిమితం అయిందీ చిత్రం. దీని బడ్జెట్టేమో రూ.200 కోట్లు.
ఓటీటీ డీల్ ముందే పూర్తి చేసినా కొంత బయటపడేవారేమో. కానీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆరు నెలలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఓటీటీ డీల్ సంగతి చూద్దామనుకున్నాడు. కానీ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఓటీటీల నుంచి పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. ఒకవేళ డీల్ జరిగినా.. తక్కువ మొత్తానికే ఉండొచ్చు. శాటిలైట్ హక్కుల ద్వారా కూడా ఆశించిన ఆదాయం వచ్చే సంకేతాలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ‘లాల్ సింగ్ చడ్డా’కు తక్కువలో తక్కువ రూ.100 కోట్లయినా నష్టం తేలుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ వయాకామ్ స్టూడియోస్ సంస్థదే. ఆమిర్ సైతం ఇందులో నిర్మాణ భాగస్వామే. తన పారితోషికం తో పాటు కొంతమేర డబ్బులు అతను పెట్టుబడిగా పెట్టాడు. గత సినిమాల మాదిరే లాభాల్లో వాటా రూపంలో పారితోషికం తీసుకోవాలని అనుకున్నాడు. చివరికి చూస్తే బొమ్మ తిరగబడింది.
నిర్మాతలు ఇప్పుడు ఫైనాన్షియర్లతో పాటు బయ్యర్లకు సెటిల్మెంట్ చేయాల్సి ఉంది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా అనుకున్నంత ఆదాయం వచ్చేలా లేదు. ఈ పరిస్థితుల్లో ఆమిర్ తన పారితోషికం కింద ఏమీ తీసుకోవట్లేదని.. తాను పెట్టిన ఖర్చును కూడా వదులుకున్నాడని తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో అతనేమీ తీసుకోబోవట్లేదని.. ఆ డబ్బుల్లో కొంత సెటిల్మెంట్ చేసి, మిగతా మొత్తంతో కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోవాలని వయాకామ్ వాళ్లకు చెప్పినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.
This post was last modified on September 1, 2022 11:34 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…