గత మూడు దశాబ్దాల్లో దక్షిణాదిన ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా పెద్ద రేంజికి ఎదిగిన హీరోల జాబితా తీస్తే అందులో అగ్రస్థానంలో ఉండే పేరు.. విక్రమ్‌దే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. కొన్నేళ్ల పాటు పోరాడి.. చివరికి ‘సేతు’ సినిమాతో హీరోగా పెద్ద బ్రేక్ అందుకుని.. సామి, పితామగన్ (శివపుత్రుడు), అన్నియన్ (అపరిచితుడు) లాంటి చిత్రాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన నటుడతను. తమిళం అనే కాక దక్షిణాదిన అంతటా అతడి స్టార్ ఇమేజ్ విస్తరించింది. అన్ని భాషల వాళ్లూ తన సినిమాల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.
విక్రమ్ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, అతడి పెర్ఫామెన్స్ అదిరిపోతుందని ఎన్నో అంచనాలతో అతడి సినిమాల కోసం థియేటర్లకు వచ్చేవాళ్లు ప్రేక్షకులు. ఐతే తన నుంచి భిన్నంగా కోరుకునే ప్రేక్షకులను మెప్పించేలా కెరీర్ ఆరంభంలో అద్భుతమైన పాత్రలు చేశాడు విక్రమ్. కానీ ఆ తర్వాత అంచనాల భారమే అతడికి శాపం అయింది. ప్రేక్షకులను సంతృప్తిపరచాలంటే తాను ఒక పాత్ర చేస్తే సరిపోదని, డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు ప్రయత్నించడం.. వాటి కోసం కళ్లు చెదిరే రీతిలో మేకోవర్ కావడం, అలాగే రకరకాల గెటప్పులు ట్రై చేయడం మామూలైపోయింది విక్రమ్‌కు.
ఇవి మొదట్లో భిన్నంగా అనిపించాయి కానీ.. తర్వాత తర్వాత జనాలకు మొహం మొత్తేశాయి. ఆల్రెడీ కమల్ హాసన్ ఇలాగే ట్రై చేసి ప్రేక్షకులకు మొహం మొత్తేలా చేశాడు. ‘దశావతారం’ ఇలాంటి వాటి మీద ప్రేక్షకులకు ఆసక్తి పోయింది. ఆ విషయం అర్థం చేసుకోకుండా విక్రమ్ మాత్రం ఈ గెటప్పులు మార్చే అలవాటును కొనసాగిస్తూ పోయాడు. మల్లన్న, ఇంకొక్కడు లాంటి చిత్రాలకు అతడి వేషాలు ఏమాత్రం ఉపయోగపడలేదు సరి కదా.. ప్రేక్షకులను అవి చికాకు పెట్టాయి.
ఇప్పుడు ‘కోబ్రా’ సినిమాలోనూ విక్రమ్ ఆ వేషాలనే రిపీట్ చేవాడు తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. ఒక మంచి నటుడి ప్రతిభ తెలిసేది సామాన్యమైన పాత్రల్ని అతను పండించే విధానంలోనే. విక్రమ్ గత చిత్రం ‘మహాన్’లో అతను ఎంత అద్భుతంగా నటించాడో మాటల్లో చెప్పలేం. కానీ ‘కోబ్రా’లో ఎన్నో అవతారాల్లో కనిపించినా ప్రేక్షకులకు అవేమీ కిక్కివ్వలేదు. సింపుల్‌గా చెప్పాలంటే విక్రమ్ ఈ వేషాల పిచ్చి వదిలిపెట్టి తన ప్రతిభకు న్యాయం చేసే పాత్రల మీద దృష్టిపెడితే మంచిది.
This post was last modified on September 1, 2022 11:31 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…