Movie News

అమీర్ కథ ఇంకా ఉంది

మూడు నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తూ చాలా సెలెక్టివ్ గా ఉంటున్న అమీర్ ఖాన్ కు ఇటీవలే లాల్ సింగ్ చడ్డా ఇచ్చిన డిజాస్టర్ షాక్ మామూలుది కాదు. ఏకంగా వంద కోట్లకు పైగా నష్టాలతో కొన్న ప్రతి ఒక్కరిని నిలువునా ముంచేసింది. ఉన్నది దాచుకున్నది రెండూ పోయాయనే సామెత తరహాలో రిలీజ్ కు ముందు ఓటిటి రూపంలో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని తిరస్కరించినందుకు ఎంత బాధపడుతున్నాడో వేరే చెప్పనక్కర్లేదు. ఇన్నేళ్లకు బాలీవుడ్ డెబ్యూ చేసిన నాగ చైతన్యకు సైతం ఇది చేదు అనుభవంగా మిగలడం మరో ట్రాజెడీ.

సరే లాల్ సింగ్ కథ ముగిసిపోయింది కదా ఇక దగ్గరలో అమీర్ ఖాన్ చూసే ఛాన్స్ లేదంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తను మరో రెండు ప్రాజెక్టులలో ఆల్రెడీ భాగమయ్యాడు. ధోభీ ఘాట్ తర్వాత అతని మాజీ భార్య మరోసారి దర్శకత్వం చేస్తున్న 2 బ్రైడ్స్ లో అమీర్ ఒక ప్రత్యేక క్యామియో చేస్తున్నాడు. ఎంత నిడివనేది బయటికి చెప్పలేదు కానీ చెప్పుకోదగ్గ ప్రాధాన్యం అయితే ఉంటుందట. కొడుకు జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ప్రీతమ్ ప్యారే వెబ్ సిరీస్ లోనూ అమీర్ ఖాన్ కనిపిస్తాడు. దీనికి హోమ్ బ్యానర్ ద్వారా స్వంత పెట్టుబడే పెడుతున్నాడు.

ఇప్పుడు వీటికీ బాయ్ కాట్ భయాలు చుట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఇవేవి పని చేయవు కానీ సోషల్ మీడియా ప్రభావం అమీర్ మూవీస్ మీద ఎంత బలంగా ఉంటుందో నిర్మాతలకు అర్థమవుతోంది. లాల్ సింగ్ దెబ్బకే ఇప్పట్లో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకూడదని అతను నిర్ణయించుకున్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి కానీ అవెంత నిజమో కొంత కాలమయ్యాకే తెలుస్తుంది. ఎప్పుడో అన్న మాటలను పట్టుకుని తనకింత నష్టం కలిగిస్తున్న ధోరణిపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని అయోమయంలో ఉన్న అమీర్ రిలీజ్ అయినప్పటి నుంచి బయట మళ్ళీ కనిపిస్తే ఒట్టు. 

This post was last modified on August 31, 2022 11:09 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

13 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago