Movie News

‘అజ్ఞాతవాసి’ని మరిచిపోని ఆ డైరెక్టర్

‘అజ్ఞాతవాసి’ పేరెత్తితే చాలు మెగా అభిమానులు బెంబెత్తిపోతారు. త్రివిక్రమ్ అభిమానులకు కూడా అది చాలా చికాకు పెట్టే టాపిక్కే. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇలాంటి డిజాస్టర్లు లేకేం కాదు కానీ.. త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయడమే పెద్ద షాక్. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కావడం ఒకెత్తయితే.. అది ఒక ఫ్రెంచ్ మూవీకి ఫ్రీమేక్ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని ఆ రకంగా కూడా త్రివిక్రమ్ పరాభవం మూటగట్టుకోవడం మరో ఎత్తు. ఆ సినిమా పేరు.. లార్గో వించ్. 2008లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్టేమీ కాలేదు.

ఇలాంటి సినిమాను కాపీ కొట్టి ‘అజ్ఞాతవాసి’ తీశాడని త్రివిక్రమ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలు కొట్టివేయదగ్గవి కూడా కావు. ఆ సినిమా ట్రైలర్ చూస్తే ‘అజ్ఞాతవాసి’తో చాలా వరకు పోలికలు కనిపిస్తాయి. సినిమా చూసిన వాళ్లు కూడా త్రివిక్రమ్ బాగానే ‘ఇన్‌స్పైర్’ అయ్యాడని అంగీకరిస్తారు. ఐతే ఇలా ఇంటర్నేషనల్ మూవీస్‌ను సైలెంటుగా కాపీ కొట్టి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు.

కాకపోతే ఇంటర్నెట్ విప్లవం, ఓటీటీల పుణ్యమా అని హద్దులు చెరిగిపోయి.. ఇలా ఏదైనా సినిమాను కాపీ కొడితే ఈజీగా దొరికిపోతున్నారు. ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ చూసి ‘లార్గోవించ్’ డైరెక్టర్ జెరోమ్ సాలె స్వయంగా రంగంలోకి దిగడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. పనిగట్టుకుని అతను ‘అజ్ఞాతవాసి’ సినిమాకు వెళ్లి తన సినిమాకు అది చాలా వరకు కాపీలా ఉందని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరి ఆయనతో ‘అజ్ఞాతవాసి’ ఏ రకంగా అయినా సెటిల్మెంట్ చేసుకుందో ఏమో తెలియదు కానీ.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆ విషయం మరుగున పడిపోయింది.

కాగా నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ దర్శకుడు లైన్లోకి వచ్చాడు. పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘జల్సా’ స్పెషల్ షోల గురించి ట్విట్టర్లో ఒక పోస్టు పెట్గగా.. దానికి అతను స్పందిస్తూ.. ‘‘కూల్.. నేనేదైనా గిఫ్ట్ తీసుకురానా? ఉదాహరణకు ఒక స్క్రిప్టు’ అని పేర్కొంటూ #PowerStarBirthday @Pawankalyan అని ట్యాగ్స్ కూడా జోడించాడు. ఐతే జెరోమ్ ‘జల్సా’ సినిమా పోస్టర్ చూసి అదే ‘అజ్ఞాతవాసి’ అనుకుని పొరబడ్డాడని అర్థం చేసుకుని పవన్ ఫ్యాన్స్ అతడికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే.. అతను మాత్రం ఆ పోస్టును డెలీట్ చేయకుండా అలాగే ఉంచేశాడు.

This post was last modified on August 31, 2022 8:52 pm

Share

Recent Posts

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

4 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

20 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

40 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago