భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో.. యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. సచిన్ భారతరత్న కావడం, అతడికున్న భారతరత్న ఇమేజ్ కారణంగా.. బాలీవుడ్ సెలబ్రెటీల తరహాలో సారా.. శుభ్‌మన్‌తో కలిసి ఎలా పడితే అలా తిరిగేయలేదు. వీళ్ల ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందన్నది మాత్రం వాస్తవమే అంటున్నాయి మీడియా వర్గాలు.
శుభ్‌మన్ నాణ్యమైన బ్యాట్స్‌మన్ కావడం.. ఐపీఎల్‌లోనే కాక భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటడం, భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తుండడంతో అతణ్ని అల్లుణ్ని చేసుకోవడంలో సచిన్‌కు కూడా అభ్యంతరాలు లేకపోవచ్చని.. గిల్-సారా జంట తమ ప్రేమాయణం గురించి ఓపెన్ కావడం లాంఛనమే కావచ్చని అంతా అనుకున్నారు.
కానీ ఈ అంచనాతో ఉన్న అందరికీ గిల్ పెద్ద షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న భారత జట్టులో సభ్యుడు కాకపోయినప్పటికీ.. ఆ టోర్నీ చూడడం కోసమో, మరో కారణంతోనూ అతను దుబాయ్‌లోనే ఉన్నాడు. ఈ సందర్భంగా అతను అక్కడో హోటల్లో వేరే అమ్మాయితో కలిసి కనిపించాడు. ఆ అమ్మాయి అనామకురాలు కాదు.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. ఇద్దరూ కలిసి ఒక హోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
ఇది అనుకోకుండా జరిగిన కలయికలా అనిపించడం లేదు. ఇద్దరూ డేటింగ్ చేస్తుండొచ్చని అంటున్నారు. సారా కొంత కాలం కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేసి.. ఆ తర్వాత ఒంటరిగా ఉంటోంది. శుభ్‌మన్ ప్రెజెంట్ స్టేటస్ ఏంటన్నది తెలియదు. సోషల్ మీడియా జనాలు మాత్రం సారా టెండుల్కర్‌ను వదిలేసి మనోడు సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం మొదలుపెట్టాడని.. ఇది పని భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.
This post was last modified on August 31, 2022 8:08 pm
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…