‘మళ్ళీ రావా’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇది చిన్న సినిమా అయినప్పటికీ.. ఒక క్లాసిక్ అన్న పేరు తెచ్చుకోవడం, ప్రేక్షకాదరణ పొందడంతో నాని లాంటి స్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ‘జెర్సీ’ లాంటి ఇంకో క్లాసిక్‌ను డెలివర్ చేశాడు. తెలుగులో ఇదే బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అనడంలో మరో మాట లేదు. ఈ సినిమాతో గౌతమ్‌కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
పెద్ద బడ్జెట్, స్టార్ హీరో ఉంటే అతను అద్భుతాలు చేయగలడు అన్న భరోసా ఇండస్ట్రీ జనాల్లో కలిగింది. అదే సమయంలో అతడికి హిందీలో ‘జెర్సీ’ని రీమేక్ చేేసే అవకాశం వస్తే అటు వెళ్లాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం విడుదలకు ముందు స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
‘జెర్సీ’ హిందీ రీమేక్ చర్చల్లో ఉండగానే రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్‌తో సినిమా కోసం గౌతమ్‌కు డిస్కషన్లు నడిచాయి. తర్వాత ఈ సినిమా ఓకే కూడా అయింది. ఆ తర్వాతే అతను ‘జెర్సీ’ హిందీ వెర్షన్ పూర్తి చేశాడు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్లలో కూడా చరణ్‌తో తన సినిమా గురించి కన్ఫమ్ చేశాడు గౌతమ్. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇదేమీ ఉత్తుత్తి ప్రచారం కాదని.. నిజంగానే ఈ సినిమా వర్కవుట్ కావట్లేదని చరణ్ సన్నిహిత వర్గాలు అంటుున్నాయి. ఈ సినిమా రద్దవడం పట్ల గౌతమ్ చాలా ఫీలవుతున్నట్లు సమాచారం.
దీనికి పరోక్షంగా ‘జెర్సీ’ రీమేకే కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఇమేజ్ పెరిగిపోవడం, ఇకపై అతను భారీ సెటప్‌తోనే సినిమాలు చేసే అవకాశాలుండడం.. భారీతనం, మాస్, యాక్షన్ అంశాలు ఉండి వాటిని బాగా డీల్ చేసే దర్శకులతోనే జట్టు కట్టాలని నిర్ణయించుకోవడంతో గౌతమ్‌కు ఛాన్స్ మిస్సయినట్లు తెలుస్తోంది. అతడి కథ కొంచెం క్లాస్ టచ్ ఉన్నది కావడం, అందులోనూ ‘జెర్సీ’ రీమేక్‌తో అతను ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో చరణ్ వెనక్కి తగ్గాడని అంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 7:10 pm
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…