గత పదేళ్లలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెలుగులోకి వచ్చి పెద్ద రేంజికి వెళ్లిన హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేయొచ్చు. మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్ అంత వేగంగా తాను స్టార్ ఇమేజ్ సంపాదించలేదని అన్నాడంటే తన రైజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘అర్జున్ రెడ్డి’ అనే ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి అతను స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సైతం బ్లాక్‌బస్టర్ కావడంతో విజయ్ రేంజి ఇంకా పెరిగిపోయింది.
ఆ తర్వాత ‘ట్యాక్సీవాలా’ రూపంలో మరో ఘనవిజయాన్ని అతను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ యువ కథానాయకుడికి ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. ఐతే సక్సెస్ సాధించంకంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని విజయ్ విషయంలోనూ రుజువైంది. చాలా తక్కువ సమయంలో తనకు బిల్డ్ అయిన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అతను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. సినిమాల ఎంపికలో దారుణమైన తప్పులు చేస్తూ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నాడు.
‘నోటా’ లాంటి పేలవమైన సినిమాకు అతను టెంప్ట్ అవడం పెద్ద మిస్టేక్. ఏం చూసి అతను ఓకే చేశాడన్నది అర్థం కాని విషయం. పైగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో చేయడం ఇంకా పెద్ద తప్పిదం. ఇక ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో విషయంలో విజయ్‌ను తప్పుబట్టడానికేమీ లేదు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ మంచి ప్రయత్నమే చేశాడు. అతడి కథలో విషయం ఉంది. కానీ ‘సంబరాల రాంబాబు’ లాంటి భరించలేని సినిమా తీసిన క్రాంతి కుమార్‌ను నమ్మి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి పేలవమైన కథను ఓకే చేసి సినిమా చేయడం ఇంకో బ్లండర్.
ఇవన్నీ చాలవన్నట్లు పూరి జగన్నాథ్ ఫామ్ గురించి తెలిసి కూడా జట్టు కట్టాడు. అతనేమీ ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ చూసి టెంప్ట్ కాలేదు. ఆ సినిమా రిలీజ్ కావడానికి ముందే పూరికి కమిట్మెంట్ ఇచ్చాడు. పోనీ కథలో ఏమైనా దమ్ముందా అంటే అదీ లేదు. విజయ్ కెరీర్లోనే అత్యంత సాధారణమైన స్క్రిప్టుల్లో ఇదొకటి. ఇలాంటి కథలను ఓకే చేస్తున్నాడంటే విజయ్‌కి ఏం జడ్జిమెంట్ ఉన్నట్లు? ఇలాంటి అభిరుచితో కెరీర్ ముందుకు సాగడం కష్టం. సొంతంగా సరైన కథలు ఎంచుకోలేకపోతున్నపుడు తోడుగా విషయం ఉన్న వ్యక్తులనైనా పెట్టుకోవాలి. లేదంటే మున్ముందు ఇలాంటి ఎదురు దెబ్బలు మరిన్ని తప్పవు.
This post was last modified on August 30, 2022 9:01 am
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్ యువ క్రికెటర్…