Movie News

విశాల్ ఇలా అయిపోయాడేంటి?

తమిళంలో సినిమాల కోసం విపరీతంగా శారీరక శ్రమకు గురయ్యే హీరోల్లో విశాల్ ఒకడు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ ఫైట్స్ ఉంటాయి అతడి చిత్రాల్లో. వాటి కోసం అతను పడే కష్టం అలాంటిలాంటిది కాదు. బేసిగ్గానే మంచి కటౌట్ ఉన్న అతను.. తాను చేసే యాక్షన్ సినిమాల కోసం చాలా ఫిట్‌గా తయారై కనిపిస్తుంటాడు. ఐతే కండలు పెంచడం, మరింత ఫిట్‌గా తయారవడం వరకు ఓకే కానీ.. లుక్ పరగా చూస్తే అతడిలో మరీ వేరియేషన్లు అయితే ఉండవు.

పోలీస్ పాత్రలు వేస్తే షార్ట్ కటింగ్, నీట్ షేవ్‌తో కనిపిస్తాడు. వేరే పాత్రలైతే కొంచెం జుట్టు, గడ్డం పెంచుకుంటాడు. అంతకుమించి విశాల్‌ మరీ వేరియేషన్ ఏమీ చూపించడు. చివరగా అతను కొత్తగా కనిపించిందంటే బాల సినిమా ‘వాడు వీడు’లోనే. ఐతే ఇప్పుడు ఓ కొత్త చిత్రం కోసం అతను పూర్తిగా అవతారం మార్చేశాడు. ఆ సినిమా పేరు.. మార్క్ ఆంటోనీ. తాజాగా లాంచ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

బాగా గడ్డం పెంచి రఫ్‌గా కనిపిస్తున్న విశాల్ కొత్త లుక్‌ను చూస్తే.. సడెన్‌గా అది కార్తియేమో అనిపిస్తోంది. ‘ఖైదీ’లో కార్తిని గుర్తు చేసేలా ఉంది ఆ లుక్. కార్తి స్టయిల్లోనే అతను గన్ను కూడా పట్టుకున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ నిండా గన్నులే కనిపిస్తున్నాయి. సినిమా చాలా వయొలెంట్‌గా ఉండేలా కనిపిస్తోంది. విశాల్ లుక్‌, ఫస్ట్ లుక్ పోస్టర్ థీమ్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అని, పీరియడ్ మూవీ కూడా అయి ఉండొచ్చని అనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నాడు. ఎప్పట్లాగే తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం విశాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇక విశాల్ నటించిన కొత్త చిత్రం ‘లాఠీ’ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. అందులో అతను కానిస్టేబుల్ పాత్ర చేశాడు. ఈ నెలలో రిలీజైన దాని టీజర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. 

This post was last modified on August 29, 2022 4:24 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

52 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago