కొవిడ్ తర్వాత బాలీవుడ్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అక్కడ పెద్ద పెద్ద హీరోలు నటించిన భారీ చిత్రాలకు కూడా సరైన వసూళ్లు రావట్లేదు. ఓపెనింగ్స్ దారుణంగా ఉంటున్నాయి. ఓవరాల్ కలెక్షన్ల గురించి చెప్పాల్సిన పని లేదు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇటీవలే ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ మూవీ ‘రక్షాబంధన్’లకు ఘోర పరాభవం ఎదురవడం తెలిసిందే.
ఇందులో ‘లాల్ సింగ్ చడ్డా’ను ఓ వర్గం అదే పనిగా టార్గెట్ చేసి దాన్ని దెబ్బ కొట్టింది. ఈ సినిమాను పొగిడాడని మరో స్టార్ హీరో హృతిక్ రోషన్‌న సైతం ఆ బ్యాచ్ లక్ష్యంగా చేసుకోవడం తెలిసిందే. దీంతో అతడి సినిమా ‘విక్రమ్ వేద’ ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనవసరంగా వీళ్లను కెలికానే అని హృతిక్ ఫీలవుతుంటే ఆశ్చర్యమేమీ లేదు.
ఐతే కొత్తగా బాలీవుడ్ సినిమాల మీద పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించి, తమ ఇమేజ్‌ను మార్చుకునేందుకు, తాము అంత యారొగెంట్ కాదని రుజువు చేసుకునేందుకు కొందరు బాలీవుడ్ స్టార్లు ప్రయత్నిస్తుండగా.. హృతిక్ సైతం అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అతను ఒక ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని స్టేజ్ మీదికి వచ్చి హృతిక్ కాళ్లకు మొక్కాడు. దీంతో ఒకింత ఆశ్చర్యపోయిన హృతిక్.. వెంటనే అతడి కాళ్లకు ప్రతి నమస్కారం చేశాడు.
హృతిక్ చేసిన ఈ పనికి అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి అభిమాని కాళ్లకు మొక్కడాన్ని కొనియాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కూడా తన సింప్లిసిటీని పొగుడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇదంతా డ్యామేజ్ కంట్రోల్లో భాగమని, వచ్చే నెల 30న రిలీజయ్యే ‘విక్రమ్ వేద’ మీద నెగెటివిటీని తగ్గించడానికి హృతిక్ ఇలా చేసి ఉంటాడని అంటున్నారు.
This post was last modified on August 28, 2022 4:57 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…