Movie News

RC15… క్లారిటీ ఇచ్చిన శంకర్

రెండేళ్ళ క్రితం కమల్ హాసన్ తో శంకర్ ‘ఇండియన్ 2’ మొదలు పెట్టాడు. కొంత వరకూ షూట్ చేశాక కొన్ని సంఘటనల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఆ గ్యాప్ లో రామ్ చరణ్ తో దిల్ రాజు బేనర్ లో శంకర్ RC 15 కమిట్ అయ్యాడు. వెంటనే చకచకా షూటింగ్ మొదలు పెట్టేసి సగం పైనే సినిమాను కంప్లీట్ చేసేశాడు. నెక్స్ట్ హిందీలో ‘అపరిచితుడు’ తీసేందుకు రెడీ అయ్యాడు. ఈ లోపు ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ శంకర్ పై పిటీషన్ వేయడం , కోర్టు శంకర్ కి సినిమా షూట్ కంప్లీట్ చేయమని ఓ నోటీస్ పంపడం జరిగింది.

వెంటనే హిందీ సినిమాను పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమా తర్వాత శంకర్ ఇండియన్ 2 ని మళ్ళీ పట్టాలెక్కిస్తాడని అందరూ ఊహించారు. కానీ కోర్టు ఇచ్చిన సూచనల మేరకూ కమల్ హాసన్ , నిర్మాత సుభాస్కరన్ రిక్వెస్ట్ తో శంకర్ ఉన్నపళంగా ‘ఇండియన్ 2’ ని మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈరోజే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. చెన్నై లో స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఇండియన్ 2 ఇలా మొదలైందో లేదో వెంటనే ఇక రామ్ చరణ్ ప్రాజెక్ట్ ని శంకర్ రెండు , మూడు నెలలు పక్కన పెట్టనున్నాడని రూమర్ చక్కర్లు కొట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ లో డౌట్స్ స్టార్ట్ అయ్యాయి.

అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే శంకర్ సోషల్ మీడియా ద్వారా మెగా ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి క్లారిటీ ఇచ్చేశాడు. ఇండియన్ 2 , RC15 రెండు సినిమాలు ఒకే సారి షూట్ జరుపుకోనున్నాయని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.  సెప్టెంబర్ నుండి రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఉంటుందని , హైదరాబాద్ , వైజాగ్ లో ఆ సినిమాను షూట్ చేయబోతున్నామని చెప్పుకున్నాడు.

దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇండియన్ 2, రాం చరణ్ సినిమా ఇలా ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ అంటే శంకర్ పై భారీ ప్రెజర్ ఉంటుంది. పైగా రెండూ పెద్ద బడ్జెట్ సినిమాలే. ఇకపై శంకర్ ఇకపై క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ రెండు గుర్రాల మీద స్వారీ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తడబడ్డా శంకర్ కెరీర్ కి పెద్ద దెబ్బే తగులుతుంది. పైగా రెండూ సినిమాల మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి శంకర్ ఈ బిగ్ ప్రాజెక్ట్స్ ని సేమ్ టైంలో క్వాలిటీ మిస్ అవ్వకుండా కంటెంట్ మీద దృష్టి పెడుతూ ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాలి.

This post was last modified on August 24, 2022 11:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

29 minutes ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

1 hour ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

2 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

2 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

3 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

4 hours ago