రామ్ చరణ్ అభిమానులు శంకర్ మూవీకి బ్రేక్ ఇచ్చారేమో అని పడుతున్న టెన్షన్ కు సమాధానం దొరికేసింది. నిజంగానే కమల్ హాసన్ ఇండియన్ 2 అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఎప్పటి నుంచి రీ స్టార్ట్ చేస్తారనే సమాచారం స్పష్టంగా లేదు కానీ మొత్తానికి దానికి సంబంధించిన అడుగులు చకచకా పడిపోతున్నాయి. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైకేల్ వెస్ట్ మోర్ తో కమల్ వ్యక్తిగతంగా సమావేశం జరిపి ఈ సినిమా తాలూకు మేకప్ ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద చర్చలు జరిపారు.
మైకేల్ గతంలో దశావతారంకు పని చేశారు. అందులో పది పాత్రల్లో లోకనాయకుడిని చూపించిన తీరు అబ్బురపరిచింది. తనతో అనుబంధం కమల్ కు అవ్వై షణ్ముఖి(భామనే సత్యభామనే)నుంచే మొదలైంది. భారతీయుడు టైంకి ఈ ఇద్దరి మధ్య పరిచయం లేదు. తర్వాత కలుసుకున్నారు. ఇండియన్ 2లో హీరో పాత్ర అమెరికాలో మొదలువుతుంది. అక్కడే ఉంటూ ఆ వేషభాషలకు అనుగుణంగా తన మొహాన్ని మార్చుకుంటాడు సేనాపతి. అందుకే ప్రత్యేకంగా మైకేల్ అయితేనే న్యాయం చేయగలడని భావించి ఇండియాకు పిలిపించి మరీ వర్క్ చేయిస్తున్నారు.
భారతీయుడు వచ్చి ఇప్పటికి పాతికేళ్ళు దాటేసింది. అంటే అప్పుడు కమల్ రిస్క్ తీసుకున్నారంటే తీవ్రంగా ఇబ్బంది పడే సమస్య రాలేదు. కానీ ఇప్పుడలా కాదు. ప్రోస్తటిక్స్ మేకప్ కు అనుగుణంగా గంటల తరబడి కూర్చోవడం అంటే మాములు విషయం కాదు. హెల్త్ పరంగా వచ్చే రిస్కులను పరిగణనలోకి తీసుకోవాలి. మైకేల్ గతంలో స్టార్ ట్రెక్ కోసం పని చేస్తున్నపుడు కమల్ ఆయన దగ్గర ఓ ముప్పై రోజులు ఉండి మరీ శిక్షణ తీసుకున్నాడు. ఇంత సీరియస్ గా వర్క్ జరుగుతోందంటే ఇండియన్ 2 వేగంగా పూర్తి చేసే ప్రణాళిక రెడీ అయ్యింది. సో రామ్ చరణ్ 15కు మరికొంత బ్రేక్ అనే క్లారిటీ వచ్చేసినట్టే
This post was last modified on August 22, 2022 6:57 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…