ఏజెంట్ వెనుక ఏం జరుగుతోంది

తనను మాస్ లో బలంగా నిలబెడుతుందని అక్కినేని అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ ఆ మధ్య టీజర్ రిలీజ్ తో హడావిడి చేశాక ఉన్నట్టుండి సైలెంట్ అయ్యింది. దానికి రెస్పాన్స్ బాగానే వచ్చినప్పటికి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అంతా సవ్యంగా అనుకున్న టైం ప్రకారం జరిగి ఉంటే ఆగస్ట్ 12న థియేటర్లలో ఏజెంట్ రచ్చ జరిగిపోయేది. కానీ సాధ్యపడలేదు. సరే క్వాలీటీ ముఖ్యమని ఫ్యాన్స్ సర్దుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా మౌనం వహిస్తే ఎలానేదే వాళ్ళ ప్రశ్న.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏజెంట్ ని డిసెంబర్ మూడో వారానికి రెడీ చేస్తున్నారు. అలా అని అదెంతో దూరంలో లేదు. జస్ట్ మూడున్నర నెలలు అంతే. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ రిలీజ్, ఈవెంట్లు వగైరా చాలా తతంగాలుంటాయి. మరి దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలంటే స్పీడ్ పెంచాలి. కొన్ని సన్నివేశాలు మరింత బెటర్ గా రావడం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత రీ షూట్ అడిగాడని, నాగార్జున అఖిల్ తో పాటు అనిల్ సుంకర వాటి పట్ల సంతృప్తిగా ఉండటంతో డిస్కషన్లు జరుగుతున్నాయని వినికిడి.

ఇదంతా వీలైనంత త్వరగా కొలిక్కి రావాలి. ఎందుకంటే ఏజెంట్ ఏదో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాదు. పదుల కోట్ల బడ్జెట్ తో ముడిపడిన ప్యాన్ ఇండియా మూవీ. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో ప్రమోషన్లు ప్లాన్ చేసుకోవాలి. మమ్ముట్టి ఉన్నాడు కాబట్టి మలయాళంలోనూ క్రేజ్ వస్తుంది. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ని ఆడియన్స్ మైండ్ లో బలంగా రిజిస్టర్ చేయాలి. ఒకవేళ డిసెంబర్ స్లాట్ మిస్ అయితే సంక్రాంతి బరిలో తన స్థాయిలో మించిన వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది. అంత రిస్క్ ఎందుకనుకుంటే ప్లానింగ్ మార్చుకోవడం అవసరం.