బాక్సాఫీస్ వద్ద పోటీ పరిస్థితులు చాలా అనూహ్యంగా ఉంటున్నాయి. ఒకే రోజు క్లాష్ అయితే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందనే భ్రమను బింబిసార, సీతారామంలు బద్దలు కొట్టేయడంతో ఎగ్జిబిటర్ల ఆనందం మాములుగా లేదు. రెండూ దేనికవే ధీటుగా వసూళ్లు రాబట్టడం మరికొందరికి ధైర్యాన్ని ఇచ్చింది. అయితే ప్రతిసారి ఇలాంటి ఫలితాలు వస్తాయని కాదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ ఎదురుగా ఒక ప్యాన్ ఇండియా మూవీని పెట్టుకుని దాంతో చిన్న సినిమాలు తలపడటం అంటే పెద్ద సాహసమే.
25న లైగర్ ఎంత గ్రాండ్ గా రిలీజవుతోందో చూస్తున్నాం. అయితే 26ను టార్గెట్ చేసి పెద్దగా బడ్జెట్ ఖర్చవ్వని చిత్రాలు రేస్ లో దిగడం ఆసక్తి రేపుతోంది. అందులో అంతో ఇంతో చెప్పుకోదగ్గ బజ్ ఉన్నది కళాపురం. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సీరియస్ జానర్ చేశాక దర్శకుడు కరుణ కుమార్ పూర్తిగా ఎంటర్ టైనర్ స్కూల్ కొచ్చి చేసిన సినిమా ఇది. అదే రోజు గీత అనే మరో చిన్న చిత్రం బరిలో ఉంది. సునీల్ ఒక్కడే మెయిన్ ఆర్టిస్టుగా ప్రమోట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న ధనరాజ్ సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన బుజ్జి ఇలా రా దిగుతోంది.
ఇవన్నీ బజ్ లేనివే. ఒకవేళ లైగర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వీటికి ఇబ్బందే. థియేటర్లు దొరకడం ఒక సమస్య అయితే టాక్ పెద్దగా బయటికి రాకపోతే తిరిగి లేపేసి లైగర్ నే వేసుకుంటారు. విజువల్ గా సంథింగ్ స్పెషల్ ఉంటే తప్ప థియేటర్లకు జనాలు అంత ఈజీగా కదల్లేని పరిస్థితులు ఉండగా ఇప్పుడివి రిస్క్ చేయడం విశేషమే. ఇక్కడితో అయిపోలేదు. వారం తిరక్కుండానే 31న విక్రమ్ కోబ్రా, తమిళ డబ్బింగ్ పిశాచి 2 వచ్చేస్తాయి. చూస్తుంటే ఈ ధైర్యానికి కారణం ఓటిటి కండీషన్లా లేక కంటెంట్ మీద బలమైన నమ్మకమా అంతుచిక్కడం లేదు.
This post was last modified on August 22, 2022 9:16 am
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తన పని ప్రారంభిస్తోందా? సైలెంట్గా తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా?…
తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ…
ప్రస్తుతం రీ రిలీజ్తో సందడి చేస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రమే కాక కింగ్, శంభో శివ శంభో,…
మొన్నటిదాకా ఇద్దరు పిల్లలు ముద్దు…అంతకు మించి వద్దు అనేది నినాదం. ఇప్పుడు ఎంత మంది వీలయితే అంత మంది పిల్లలను…
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి గాల్లో తేలిపోతున్నారు. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో వైట్ వాష్, బోర్డర్-గావస్కర్…
సమంత కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘ఓ బేబీ’ ఒకటి. ఒక కొరియన్ మూవీకి రీమేక్ అయినప్పటికీ... మన…