స్టార్ హీరోలకు తమ సినిమా మీద ఎంత నమ్మకమైనా ఉండొచ్చు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారితేనే అసలు సమస్య. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టం పదుల కోట్లలో ఉంటుంది. అదిప్పుడు అమీర్ ఖాన్ విషయంలో అక్షరాలా నిజమయ్యింది. ముంబై మీడియాలో వస్తున్న పలు కథనాలు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. లాల్ సింగ్ చడ్డా విడుదల ముందు నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమీర్ ఖాన్ నూటా యాభై కోట్లకు ఓటిటి డీల్ అడిగాడట. ప్రైమ్, హాట్ స్టార్ కన్నా గ్లోబల్ రీచ్ దీనికే ఎక్కువ కాబట్టి ఎలాగైనా ఒప్పించాలని పూనుకున్నాడు.
కానీ తను అడిగింది మరీ ఎక్కువగా ఉండటంతో సదరు సంస్థ నసిగింది. తక్కువ గ్యాప్ తో 100 కోట్లలోపైతే ఆలోచిస్తామని బదులిచ్చారు. అయితే అమీర్ ససేమిరా అన్నాడు. 125 కోట్లు ప్లస్ ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ కండీషన్ తో మరో ప్రతిపాదన పంపించాడు. దీన్ని నెట్ ఫ్లిక్స్ అసలే వద్దనుకుని సైలెంట్ అయ్యింది. వూట్ సెలెక్ట్ ఇంత మొత్తం కాదు సిక్స్ మంత్స్ ఓకే కానీ ధర మాత్రం రిలీజయ్యాక ఫిక్స్ చేద్దామని డీల్ చేసుకుంది. కట్ చేస్తే లాల్ సింగ్ చడ్డా అమీర్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
నిజానికి నెట్ ఫ్లిక్స్ తమ ఆఖరి ప్రపోజల్ గా 80 కోట్లు ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. అయినా కూడా తగ్గేదేలే అన్న అమీర్ అత్యాశ ఇప్పుడు నిలువునా కొంప ముంచేసింది. ముందు బిల్డప్ ఇచ్చినట్టు నిజంగానే ఆరు నెలల తర్వాత లాల్ సింగ్ చడ్డాని ఓటిటిలో వదిలితే చూసేవాళ్ళు ఉండరు. ఇప్పుడున్న వ్యతిరేకత అప్పటికి తగ్గిపోతుందనుకుంటే అమాయకత్వమే. ఏదో గుడ్డిలో మెల్లలాగా వీలైనంత త్వరగా స్మార్ట్ స్క్రీనింగ్ ఇచ్చేస్తే బాయ్ కాట్ చేసినవాళ్లు కూడా ఇంట్లోనే కదాని చూసే అవకాశాలు ఉంటాయి. లేదంటే అంతే సంగతులు
This post was last modified on August 21, 2022 8:17 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…