నమిత.. ఈ పేరును 2000-2010 మధ్య యవ్వనంలో ఉన్న కుర్రాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. ఇటు తెలుగులో, అటు తమిళంలో తన హాట్ హాట్ అందాలతో ఆమె అప్పటి కుర్రాళ్లను ఒక ఊపు ఊపేసింది. నటిగా అవకాశాలు పూర్తిగా ఆగిపోయిన దశలో, ఐదేళ్ల కిందట నమిత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైంది. ఆమె భర్త పేరు వీరేంద్ర చౌదరి. అతను తెలుగువాడే. ఈ జంటకు ఇప్పుడు కవలలు పుట్టారు. చెన్నైలో నమిత ఒకేసారి ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా నమితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. భార్యాభర్తలిద్దరూ తలో బిడ్డను ఎత్తుకున్న ఫొటోను నమిత పోస్ట్ చేసింది. తనతో పాటు బిడ్డలూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన నమిత.. గర్భం దాల్చినప్పటికీ వైద్యపరంగా సలహాలు, సూచనలు అందించిన అందరికీ, అలాగే ప్రసవానికి సహకరించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపింది.
2002లో తెలుగులో ‘సొంతం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది నమిత. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా నమితకు మంచి పేరే వచ్చింది. ఈ ఫేమ్‌తో ‘జెమిని’ లాంటి పెద్ద సినిమాలో కథానాయికా అవకాశం దక్కించకుంది. కానీ ఆ సినిమా సైతం ఫ్లాప్ అయింది. ఆపై ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణులు లాంటి క్రేజీ చిత్రాల్లో నటించిన ఫలితం లేకపోయింది. ఆ టైంలోనే ఆమె దృష్టి తమిళ చిత్రాలపై పడింది.
తెలుగులో మాదిరి ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేయకుండా.. అక్కడ హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. వ్యాంప్ పాత్రలు, ఐటెం సాంగ్స్‌లో మెరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మారిపోయింది. విపరీతంగా బరువు పెరిగిపోయి, ఆ భారీ అందాలనే ఆరబోయడం మొదలు పెట్టిన నమిత కొన్ని వివాదాలూ ఎదుర్కోక తప్పలేదు. తెలుగులో సైతం తర్వాత ఆమె వ్యాంప్ తరహా పాత్రలే చేసింది. కెరీర్ చివరి దశలో తమిళంలో ఆమె కొన్ని బిగ్రేడ్ సినిమాల్లోనూ నటించింది. చివరికి ఐదేళ్ల కిందట తెలుగు వాడే అయిన నరేంద్రను నమిత తిరుమలలో సింపుల్‌గా పెళ్లి చేసుకుంది.
This post was last modified on August 20, 2022 10:10 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…