కొందరు హీరోలు అపజయాలను తీసుకోలేరు. సినిమా ఫ్లాప్ అనే పదాన్ని అస్సలు ఒప్పుకోరు. సినిమా మీద తమకున్న నమ్మకంతో సినిమా బాలేదని ఎవరైనా చెప్పినా కొట్టి పారేస్తుంటారు. అలా అపజయాన్ని ఒప్పుకొని హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. అవును నాని తన సినిమా ఆడలేదు , డబ్బులు రాలేదు అంటే అస్సలు ఒప్పుకోడు.
జెర్సీ , వీ , టాక్ జగదీశ్ విషయంలో మీడియాతో డిబేట్ గా కూడా దిగాడు. జెర్సీ కంటెంట్ పరంగా అందరినీ మెప్పించింది కానీ ఆశించిన కలెక్షన్స్ రాలేదు. కానీ నాని అప్పట్లో తనకి తెల్సిన ఏవో లెక్కలు చెప్పి అది ప్రాఫిట్ ప్రాజెక్ట్ అని నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిందని అన్నాడు. ఆ తర్వాత V, టక్ జగదీశ్ విషయంలోనూ ఇలాగే చెప్పుకున్నాడు. ఓటీటీ లో ఆ సినిమాలు హిట్ అని రిలీజైనప్పటి నుండి మంచి వ్యూస్ అందుకున్నాయని, తమకి ఓటీటీ సంస్థలు ఫ్లవర్ బొకేలు కూడా పంపి కంగ్రాట్స్ చెప్పారని ఏవేవో చెప్పాడు. దాంతో నాని ఓటమిని ఒప్పుకోడని అలా చెప్పిన వారితో డిబేట్ పెట్టుకుంటడని మీడియాకి అర్థమైంది.
తాజాగా సుదీర్ బాబు కూడా నాని రూట్లోనే వెళ్తున్నాడని అతని మాటలు వింటే అర్థమవుతుంది. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు సుదీర్ బాబు. ఈవెంట్ లో డైరెక్టర్ ఇంద్రగంటి ని ‘వీ’ రిజల్ట్ గురించి మీడియా పర్సన్ అడగ్గానే వెంటనే మైక్ పట్టుకొని మధ్యలో మాట్లాడి ఆ సినిమా హిట్ అంటూ చెప్పుకున్నాడు. IMDB లో తమ సినిమాకు 7 రేటింగ్ దక్కిందని మీడియాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు.
‘వీ’ సినిమా రిజల్ట్ ఏమైందో ఆడియన్స్ కి తెలిసిందే. డైరెక్ట్ గా ఒటీటీలో రిలీజైన ఆ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే సుదీర్ బాబు మాత్రం అప్పటి పరిస్థితులు వేరని ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల కొంతమందికి నచ్చలేదని కానీ అది హిట్ సినిమా అని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూస్తే సుదీర్ బాబు నాని ను ఈ విషయంలో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా హీరోలు , దర్శకులు , నిర్మాతలు ఎవరైనా తమ సినిమా మీద ప్రేమతో అపజయాన్ని తీసుకోలేరు. కానీ రియాలిటీ తెలుసుకొని తర్వాత అనాలసిస్ చేసుకుంటే బాగుంటుంది.
This post was last modified on August 17, 2022 9:55 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…