‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. దీని కంటే ముందు అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు కానీ.. ఈ సినిమాతో అతను బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం అంతా ఇంతాకాదు. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద జరిగిన మారణకాండను ఎంతో హృద్యంగా, ఒళ్లు గగుర్పొడిచేలా అతను చూపించిన వైనం ప్రేక్షకులను మెప్పించింది. చిన్న సినిమాగా రిలీజై అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం బాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా తీయడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నుంచి ఫుల్ సపోర్ట్ పొందిన వివేక్.. బాలీవుడ్లో లిబరల్స్‌గా పేరున్న హీరోలు, దర్శకులను ఈ మధ్య గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా అతను ‘లాల్ సింగ్ చడ్డా’ను టార్గెట్ చేశాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ పూర్ ఓపెనింగ్స్ గురించి పేర్కొన్న ఒక ట్వీట్‌పై వివేక్ స్పందిస్తూ.. బాలీవుడ్ ఇలాంటి అవమానాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఎవరు? బాలీవుడ్లో ఎంతోమంది నటులు, దర్శకులు, రచయితలను బాయ్‌కాట్ చేసి వాళ్ల కెరీర్లు నాశనం కావడానికి కారణమైనపుడు వారి గురించి ఎవరైనా నోరెత్తారా అని ప్రశ్నించాడు.
బాలీవుడ్ డాన్లు ఎన్నో చిన్న సినిమాలను నాశనం చేశారని.. మల్టీప్లెక్సుల్లో షోలు పడకుండా ఆపించారని.. కొందరు క్రిటిక్స్ సైతం చిన్న సినిమాలను చంపేయడానికి ప్రయత్నించారని.. అప్పుడు ఆయా సినిమాలకు పని చేసిన 250 మంది పేద యూనిట్ సభ్యుల గురించి ఎవరూ ఆలోచించలేదని వివేక్ అన్నాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ కోసం 250 మంది కష్టపడి పని చేశారని, ఆ సినిమాను బాయ్‌కాట్ చేయొద్దని కథానాయిక కరీనా కపూర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు వివేక్ పంచ్ వేశాడన్నది స్పష్టం. ఆమిర్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురు దెబ్బ తగలగానే ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు పట్ల బాలీవుడ్లో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. ఐతే తన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ను బాయ్‌కాట్ చేయాలని ఇలాగే ఒక వర్గం ద్వేషపూరిత ప్రచారం చేసినపుడు వీళ్లంతా ఏం చేస్తున్నారని అతను ప్రశ్నించాడు.
This post was last modified on August 15, 2022 6:34 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…