నిన్న సాయంత్రం నుంచి ఆర్ఆర్ఆర్ కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆస్కార్ బెస్ట్ యాక్టర్స్ ప్రాబబుల్(సాధ్యమయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళు) లిస్టులో ఉందనే ప్రచారం బాగా హోరెత్తిపోతోంది. సోషల్ మీడియాలో వెరిఫైడ్ స్టేటస్ ఉన్న వెరైటీ అనే అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో తారక్ ని పొందుపరచడంతో ఒక్కసారి ఈ టాపిక్ కి ప్రాముఖ్యత వచ్చేసింది. కొమరం భీముడిగా యంగ్ టైగర్ పాత్ర ఎంత గొప్ప ప్రశంసలు అందుకుందో ఎంత గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే.
2023లో జరగబోయే ఆస్కార్ పురస్కారాల గురించి ఇలాంటి ముందస్తు అంచనాలు వేయడం సాధారణంగా జరిగేదే. కానీ ప్రతి సారి మన భారతీయ చిత్రాలు వాటిలో ఉండటం తీరా చివరి మెట్టు దగ్గర నిరాశగా వెనుదిరగడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ప్రత్యేకంగా ఈసారి ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఇంకో ఆసక్తికరమైన కోణాన్ని గమనించాలి. ఆర్ఆర్ఆర్ నెట్ ఫ్లిక్స్ లో ఇంటర్ నేషనల్ లెవెల్ లో కాంప్లిమెంట్స్ వచ్చాయి. రస్సో బ్రదర్స్ మొదలుకుని బ్లాక్ ఫోన్ రచయిత దాకా వేలాది క్రియేటర్స్ పొగిడారు.
దీంతో ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి రానంత రీచ్ ఒక్క ఆర్ఆర్ఆర్ కు మాత్రమే దక్కింది. సహజంగానే ఆస్కార్ కమిటీ దృష్టిలో ఈ పరిణామాలు ఉండకుండా పోవు. ఎలాగూ రాజమౌళి టీమ్ దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ చేస్తుంది కానీ ఈసారైనా ఆ గౌరవం దక్కుతుందేమో చూడాలి. RRR వచ్చి నాలుగు నెలలు దాటుతున్నా ఏదో ఒకరూపంలో దానికి సంబంధించిన చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. మూవీలో తమ హీరో పాత్ర ప్రాధాన్యం కొంత తగ్గిందని ఫీలైన తారక్ ఫ్యాన్స్ కి ఇప్పుడీ వార్త మంచి బూస్ట్ లా పని చేస్తోంది
This post was last modified on August 14, 2022 1:18 pm
టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్…
మాటలు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టం. డైలాగులు పెట్టకుండా కేవలం సీన్స్ తో కన్విన్స్ చేయడం అసాధ్యం కాబట్టి దర్శక…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్…
మొన్న పొంగల్ పండక్కు విడుదలైన కార్తీ వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవి చూసింది. జన నాయకుడు…
ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని.. అమ్మాయిలు స్ట్రిక్ట్గా, ప్రొఫెషనల్గా ఉంటే వారి జోలికి ఎవ్వరూ రారని ఇటీవల…
విజయ్ జన నాయకుడు కథ మళ్ళీ మొదటికే వచ్చింది. యు/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని…