పోకిరి రీ రిలీజ్ సృష్టించిన ట్రెండ్ ఏకంగా మెగాస్టార్ అభిమానులను సైతం కదిలించింది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మొదటి పది కోట్ల గ్రాసర్ ఘరానా మొగుడుని థియేటర్లలో తీసుకురాబోతున్నారు. 1992లో విడుదలైన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఒక రీమేక్ మూవీతో దర్శకేంద్రులు కె రాఘవేంద్ర చేసిన మేజిక్ కి బాక్సాఫీస్ దాసోహమంది. అందుకే ఆ మెగా మేనియాని ఇప్పటి తరానికి బిగ్ స్క్రీన్ మీద చూపించే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే సెప్టెంబర్ 2న జల్సా వేసుకునేందుకు పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దానికన్నా ముందు అన్నయ్య ని రంగంలోకి దించేస్తున్నారు. ఇలా చేయడం బాగానే ఉంది కానీ వీటికీ రెగ్యులర్ గా ఉన్న టికెట్ రేట్లే పెడుతుండటంతో రాబోయే రోజుల్లో వీటికి స్థిరమైన ఆదరణ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందరూ చూసే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాయితీ ఇచ్చే ఆలోచనలు చేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. పోకిరికి సైతం హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రెండు వందల దాకా అమ్మారు.
ఇక ఘరానా మొగుడు విషయానికి వస్తే ఒకవేళ ఇది కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే నెక్స్ట్ వరసలో శివ కూడా ప్లాన్ చేయబోతున్నారని తెలిసింది. కొన్నేళ్ల క్రితం దీన్ని రీ మాస్టర్ చేసి విడుదల చేస్తామని నాగార్జున అన్నారు కానీ ఆ మాటకు కట్టుబడలేక పోయారు. ఇప్పుడేమైనా పునరాలోచన చేస్తారేమో చూడాలి. సరే ఈ ఉత్సాహం మెచ్చుకోదగిందే కానీ కొత్త సినిమాలకే జనం థియేటర్లకు పూర్తిగా రావడం లేదని బాధపడుతున్న టైంలో వాటికొచ్చే కలెక్షన్లను సైతం పాత బ్లాక్ బస్టర్స్ పంచేసుకుంటే ఎలా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 14, 2022 8:22 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…