బాలీవుడ్ ఎంతటి గడ్డు పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఆగస్ట్ 11 గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాకు రెండో రోజే సుమారు 1300 పైగా షోలు క్యాన్సిల్ కావడం ఆ హీరో కెరీర్ లోనే దారుణమైన అవమానంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవి రద్దు చేయడానికి కారణం కనీసం పది మంది ప్రేక్షకులైనా టికెట్లు కొనకపోవడమే. కరెంట్ బిల్లులైనా రాకపోతే ఆడించి ప్రయోజనం ఏముందని అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారట. ఇందులో మల్టీప్లెక్సులు కూడా ఉన్నాయి.
నిజానికి మొదటి షో టాక్ బయటికి రాకముందే దీనిపట్ల జనం ఆసక్తి కనబరచడం లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. దానికి తోడు పబ్లిక్ టాక్, రివ్యూలు దారుణంగా ఉండటంతో నేరుగా థియేటర్ కు వెళ్లి టికెట్లు కొనాలనుకున్న బ్యాచ్ కూడా ఇంట్లోనే ఆగిపోయింది. తన సినిమా ఆరు నెలల తర్వాత కానీ ఓటిటిలో రాదని అమీర్ ఖాన్ పదే పదే చెప్పుకున్నా ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే ఆరు సంవత్సరాల తర్వాత డిజిటిల్ లో వదులుతామని చెప్పినా ఎలాంటి ప్రయోజనం కలిగే సూచనలు కనిపించడం లేదు.
క్రమం తప్పకుండా నార్త్ ట్రేడ్ కి బ్యాడ్ ఫ్రైడేస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడునెలలు గడిచిపోయాయి. ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్య 2, గంగూబాయ్ కటియావాడి తప్ప చెప్పుకోదగ్గ విజయాలు లేవు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సైతం ఎమోషన్ సెంటిమెంట్ దట్టంగా వడ్డించినా సరే తిరస్కారం తప్పేలా లేదు. ఇలా వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు షోలు క్యాన్సిల్ అయ్యే పరిణామం ఇండస్ట్రీకి ఎంత మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా మాస్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన నష్టానికి అక్కడి మేకర్స్ తగిన మూల్యమే చెల్లిస్తున్నారు
This post was last modified on August 13, 2022 1:03 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…