ఇటీవలే చేసిన పోకిరి రీ రిలీజ్ ఎంత ప్రకంపనలు సృష్టించిందో చూశాంగా. పదహారేళ్ళ తర్వాత థియేటర్లోకొస్తే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ సైతం ఎగబడి చూశారు. అధికారిక లెక్కల్లోనే సుమారు 1 కోటి 70 లక్షల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ఇంకా ఎక్కువే ఉంటుందని వాదిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా దానికొచ్చిన రెస్పాన్స్ మాత్రం మైండ్ బ్లోయింగని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
పండుగాడి విశ్వరూపాన్ని, పూరి జగన్నాధ్ మాయాజాలాన్ని, మణిశర్మ సంగీతంతో కలిపి ఫుల్ గా ఎంజయ్ చేశారు. ఇప్పుడీ ట్రెండ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందిపుచ్చుకున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జల్సా మళ్ళీ థియేటర్లలో రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వబోతున్నారు.
కొద్దిరోజుల క్రితం దీని ప్రదర్శనకు కావాల్సిన ఒరిజినల్ డిపిఎక్స్ ఫైల్ మిస్ అయ్యిందని షో వేసే అవకాశం ఉంటుందో లేదోననే అనుమానాలు రేగాయి. అయితే ఫైనల్ గా గీతా ఆర్ట్స్ దీనికి చెక్ పెడుతూ నెగటివ్ ని రీ మాస్టరింగ్ కి ఇచ్చేసిందట. ప్రసాద్ ల్యాబ్స్ లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కం మ్యూజికల్ ఎంటర్ టైనర్ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. టీవీలో వచ్చాక ఇదో క్లాసిక్ గా మారిన మాట వాస్తవం. నక్సలైట్ గా, జనజీవనంలో కలిసిపోయిన సరదా కుర్రాడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ని పవన్ పోషించిన తీరు ఓ రేంజ్ లో మెప్పించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పేదేముంది. సో పండుగాడు వంతు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సంజయ్ సాహు ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి
This post was last modified on August 12, 2022 7:18 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…