Movie News

లాల్ సింగ్ చడ్డా ఎలా ఉందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు ‘లాల్ సింగ్ చడ్డా’ తో ఇవ్వాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సరైన హిట్ లేక బాలీవుడ్ తల్లడిల్లుతున్న తరుణంలో ఆమీర్ ఖాన్ ఓ సాలిడ్ హిట్ ఇస్తాడని అంతా ఆశించారు.  తెలుగులో మెగాస్టార్ సినిమాను భూజలపై వేసుకొని సమర్పించడం  , చురుగ్గా ప్రమోషన్స్ చేయడంతో తెలుగులోనూ కాస్త బజ్ క్రియేట్ అయింది. కానీ ఈ సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాడు ఆమీర్. 

నిజానికి ఫారెస్ట్ గంప్ సినిమాను ఎంచుకోవడమే మేకర్స్ చేసిన పెద్ద మిస్టేక్. స్లో గా సాగే ఇలాంటి కథల్ని బాగా డీల్ చేయాలి లేదంటే టచ్ చేయకూడదు. దర్శకుడు అద్వైత్ చందన్ ఏదో శాయశక్తుల ప్రయత్నించాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. సిక్కుల గురించి అలాగే టెర్రరిజం గురించి ఏవో లోతుగా చెప్పే ప్రయత్నం చేసి వాటిని పైపై లేయర్స్ గా పెట్టుకున్నాడు. సినిమాలో ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. అమ్మ సెంటిమెంట్ కూడా పండలేదు. దీంతో రెండు గంటల నలబై నిమిషాల పాటు లాల్ సింగ్ విసుగు తెప్పించి బోర్ కొట్టించాడు.

 సినిమాకు ప్రతీ ఒక్కరు కష్టపడ్డారు. ఆమీర్ లాల్ సింగ్ చడ్డా గా కనిపించేందుకు మరింత కష్టపడ్డాడు. కానీ ఆ కష్టమంతా బూడిదపాలైంది. దీంతో రిజల్ట్  ఊహించినట్టుగా రాలేదు. సినిమా నత్తనడకన నడిపిస్తూ అధిక రన్ టైంతో కూడా దర్శకుడు ప్రేక్షకుడిని బాగా విసిగించాడు. చివర్లో రన్నింగ్ సీన్స్ అయితే ప్రేక్షకుడిని థియేటర్స్ లో కట్టేసి ఇబ్బంది పెట్టేస్తాయి. మధ్యలో ఆమీర్ – చైతు మధ్య వచ్చే బనియన్లు , డ్రాయర్ల కన్వర్సేషణ్ అయితే ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ఆమీర్ బిజినెస్ ఎపిసోడ్ అంతా రూప క్లాత్ కంపెనీ బ్రాండ్ పెంచేలా వారికి యాడ్ తీసినట్టుగా ఉన్నాయి. ఏదేమైనా ఆమీర్ ఈ సినిమా కోసం పడిన కష్టం . చిరు సపోర్ట్ అంతా వృధా అయ్యాయి. ఓవరాల్ గా లాల్ సింగ్ చడ్డా మెప్పించలేక బోల్తా కొట్టింది.

This post was last modified on August 11, 2022 9:35 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

50 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago