బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు ‘లాల్ సింగ్ చడ్డా’ తో ఇవ్వాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సరైన హిట్ లేక బాలీవుడ్ తల్లడిల్లుతున్న తరుణంలో ఆమీర్ ఖాన్ ఓ సాలిడ్ హిట్ ఇస్తాడని అంతా ఆశించారు. తెలుగులో మెగాస్టార్ సినిమాను భూజలపై వేసుకొని సమర్పించడం , చురుగ్గా ప్రమోషన్స్ చేయడంతో తెలుగులోనూ కాస్త బజ్ క్రియేట్ అయింది. కానీ ఈ సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాడు ఆమీర్.
నిజానికి ఫారెస్ట్ గంప్ సినిమాను ఎంచుకోవడమే మేకర్స్ చేసిన పెద్ద మిస్టేక్. స్లో గా సాగే ఇలాంటి కథల్ని బాగా డీల్ చేయాలి లేదంటే టచ్ చేయకూడదు. దర్శకుడు అద్వైత్ చందన్ ఏదో శాయశక్తుల ప్రయత్నించాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. సిక్కుల గురించి అలాగే టెర్రరిజం గురించి ఏవో లోతుగా చెప్పే ప్రయత్నం చేసి వాటిని పైపై లేయర్స్ గా పెట్టుకున్నాడు. సినిమాలో ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. అమ్మ సెంటిమెంట్ కూడా పండలేదు. దీంతో రెండు గంటల నలబై నిమిషాల పాటు లాల్ సింగ్ విసుగు తెప్పించి బోర్ కొట్టించాడు.
సినిమాకు ప్రతీ ఒక్కరు కష్టపడ్డారు. ఆమీర్ లాల్ సింగ్ చడ్డా గా కనిపించేందుకు మరింత కష్టపడ్డాడు. కానీ ఆ కష్టమంతా బూడిదపాలైంది. దీంతో రిజల్ట్ ఊహించినట్టుగా రాలేదు. సినిమా నత్తనడకన నడిపిస్తూ అధిక రన్ టైంతో కూడా దర్శకుడు ప్రేక్షకుడిని బాగా విసిగించాడు. చివర్లో రన్నింగ్ సీన్స్ అయితే ప్రేక్షకుడిని థియేటర్స్ లో కట్టేసి ఇబ్బంది పెట్టేస్తాయి. మధ్యలో ఆమీర్ – చైతు మధ్య వచ్చే బనియన్లు , డ్రాయర్ల కన్వర్సేషణ్ అయితే ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ఆమీర్ బిజినెస్ ఎపిసోడ్ అంతా రూప క్లాత్ కంపెనీ బ్రాండ్ పెంచేలా వారికి యాడ్ తీసినట్టుగా ఉన్నాయి. ఏదేమైనా ఆమీర్ ఈ సినిమా కోసం పడిన కష్టం . చిరు సపోర్ట్ అంతా వృధా అయ్యాయి. ఓవరాల్ గా లాల్ సింగ్ చడ్డా మెప్పించలేక బోల్తా కొట్టింది.