దేశమంతా తిరిగి ప్రమోషన్లు చేసుకున్న లాల్ సింగ్ చడ్డా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైపోయింది. దీని మీద మన జనానికి అంతో ఇంతో ఆసక్తి కలిగిందంటే అది కేవలం నాగ చైతన్య వల్లే. బాయ్ కాట్ నినాదంతో గట్టి సెగలు ఎదురుకుంటున్న అమీర్ బృందానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గత రెండు మూడు రోజులుగా విపరీతమైన ఆందోళన కలిగించింది.
పైగా పోటీలో ఉన్న అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం, ప్రీ రిలీజ్ వైబ్రేషన్స్ దానికే కొంత మెరుగ్గా ఉండటం మరో ట్విస్ట్. సరే ఫైనల్ గా మాట్లాడేది కంటెంటే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా మీద మిశ్రమ స్పందన వస్తోంది. క్రిటిక్స్ పెదవి విరిచారు. మంచి అవకాశాన్ని అమీర్ వృధా చేసుకున్నాడని, ఫారెస్ట్ గంప్ ని రీమేక్ చేయకపోయినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ జోరుగా వీస్తోంది. పోనీ చైతు క్యారెక్టర్ అయినా బలంగా ఉండి తనకు బాలీవుడ్ ఆఫర్లు తెచ్చేలా ఉందా అంటే అదీ జరగలేదనే చెప్పాలి. బోడిపాలెం బాలరాజుకి ఇచ్చిన స్క్రీన్ టైం తక్కువే. తాను ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉండనని నాగచైతన్య ముందే చెప్పాడు.
కథలో కీలకమైన మలుపు కూడా అతనితో ముడిపడి ఉంది. కానీ ఆ పాత్రకు అల్లిన చడ్డీ బనియన్ కాన్సెప్ట్ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. పదే పదే ఈ రెండు పదాలను పలికిస్తూ ఆర్మీలో ఉన్నా వీటి జపమే చేసే బాలరాజుగా పెర్ఫార్మన్స్ బాగానే వచ్చినప్పటికీ ఈ ఎపిసోడ్ మాత్రం అంతగా పేలలేదు. అసలే థాంక్ యు ఫలితం నిరాశ కలిగించిందని స్వయానా ఒప్పుకున్న చైతుకి ఇప్పుడీ లాల్ సింగ్ చడ్డా కూడా అదే రిజల్ట్ ఇచ్చేలా ఉండటం బ్యాడ్ లక్
This post was last modified on August 11, 2022 8:15 pm
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…