గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ దక్కకపోయినా ఏదో ఒకటి కమర్షియల్ గా వర్కౌట్ చేసుకుంటూ పోతూ గజినీ మహమ్మద్ లా దండయాత్రలు చేస్తూనే వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఆఖరికి ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అది ఎక్కడి దాకా వచ్చిందో పూర్తయ్యిందో లేదో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.
దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉంటున్నా దానికి సంబంధించిన విషయాలు మాత్రం ఎక్కడా ప్రస్తావనకు తేవడం లేదు. అధికశాతం పూర్తయినా మౌనంగానే ఉన్నారు. దీని సంగతలా ఉంచితే బెల్లం ఫ్యామిలీ రెండో వారసుడు గణేష్ హీరోగా డెబ్యూ చేస్తున్న మూవీ స్వాతిముత్యం వాస్తవానికి ఈ 13కి విడుదల కావాల్సి ఉంది. అయితే పరిస్థితులు ప్లస్ పోటీ దృష్ట్యా దాన్ని వాయిదా వేశారు.
ఇవాళ కొత్త డేట్ అక్టోబర్ 5 ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఆల్రెడీ అదే తేదీకి నాగార్జున ది ఘోస్ట్ వస్తుందని తెలిసీ స్వాతిముత్యంని బరిలో దింపడం ఆసక్తి రేపుతోంది. పైగా చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా పండగ రేస్ లో ఉండొచ్చని ఆ మధ్య టీజర్ లో హింట్ ఇచ్చేశారు. మరి ఇద్దరు సీనియర్ల మధ్య దిగడం ఖచ్చితంగా రిస్కే. పైగా ఈ స్వాతిముత్యం గ్రాఫిక్స్ తో ముడిపడిన గ్రాండియర్ కాదు. మాస్ ఎలిమెంట్స్ కూడుకున్న మసాలా మూవీ కాదు. ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా సాగే సాఫ్ట్ మూవీ.
అలాంటప్పుడు చిరు నాగ్ ల మధ్య రావడం కన్నా సోలోగా వస్తే ప్రేక్షకులకు ఇంకా బాగా రిజిస్టర్ అవ్వడంతో పాటు రీచ్ ఎక్కువగా ఉంటుంది. అసలే చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప జనం థియేటర్ల దాకా రావడం లేదు. అలాంటిది కొత్త హీరో కోసం టికెట్లు కొనాలంటే ఏమేం ఉండాలో వేరే చెప్పాలా. కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా టైటిల్ ని వాడుకుంటున్న గణేష్ మరి అంతే స్థాయిలో ఫలితం తెచ్చుకుంటాడా చూద్దాం
This post was last modified on August 10, 2022 9:55 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…