Movie News

చైతూ సినిమాను పట్టించుకుంటారా?

కొన్నేళ్ల ముందు వరకు ఇండియాలో ఆమిర్ ఖాన్ నంబర్ వన్ హీరో. కంటెంట్ పరంగా చూసినా, కలెక్షన్ల పరంగా చూసినా ఆయన్ని కొట్టేవాడు లేడు ఇండియాలో. ‘దంగల్’తో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ మూవీని అందించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటాడు. కానీ ‘బాహుబలి’ వచ్చాక కథ మారిపోయింది. ఇండియాలో సౌత్ సినిమాల ఆధిపత్యం మొదలైంది. అదే సమయంలో హిందీ చిత్రాల స్థాయి పడిపోతూ వచ్చింది. కరోనా తర్వాత అయితే బాలీవుడ్ పరిస్థితి దయనీయంగా మారింది. తమ సినిమాలను హిందీ ప్రేక్షకులే ఆదరించట్లేదు.

రకరకాల కారణాల వల్ల అక్కడ బాలీవుడ్ స్టార్ల పట్ల వ్యతిరేక భావం మొదలైంది. అదే సమయంలో సౌత్ సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. గత కొన్ని నెలల్లో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలకు ఎలా బ్రహ్మరథం పట్టారో తెలిసిందే. ఇలాంటి టైంలో ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి ఏదీ కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఓవైపు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ ఒక వర్గం సోషల్ మీడియాలో అదే పనిగా నెగెటివ్ ప్రచారం చేస్తోంది.

మరోవైపు బాలీవుడ్ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర అసలు కలిసి రావట్లేదు. దీనికి తోడు హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు ఇది రీమేక్ కావడం వల్ల ప్రేక్షకుల్లో అంతగా ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అందులోనూ ఇలాంటి పాత్రనే ఆమిర్ ‘పీకే’లో చేయడం ప్రతికూలంగా కనిపిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్లు దీనికి పోటీగా వస్తున్న ‘రక్షాబంధన్’కు మంచి బజ్ కనిపిస్తోంది. ఇలా హిందీలో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఇక నాగచైతన్య కీలక పాత్ర చేశాడు కాబట్టి తెలుగులో సినిమాకు మంచి స్పందన వస్తుందేమో అనుకుంటే.. అతను ఇటీవలే ‘థాంక్యూ’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు.

ఆమిర్ హిందీతో సమానంగా తెలుగులో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి గట్టిగా ప్రయత్నించాడు. ఒకటికి రెండుసార్లు సెలబ్రెటీలకు ప్రిమియర్స్ వేశాడు. అయినా కూడా అనుకున్నంత బజ్ కనిపించడం లేదు. ఈ వారం రిలీజైన బింబిసార, సీతారామం చిత్రాలకు  మంచి టాక్ వచ్చి అవి బాగా ఆడుతున్నాయి. రెండో వారం కూడా ఈ చిత్రం ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వచ్చే వారం రానున్న ‘కార్తికేయ-2’, ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా వాటి స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య చైతూ ప్రత్యేక పాత్ర చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ను ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహం.

This post was last modified on August 7, 2022 6:05 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

12 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

52 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago