సాహో, రాధే శ్యామ్ ల ఫలితాలు ఎంత నిరాశపరిచినా ప్రభాస్ అభిమానులు అవేమీ పట్టించుకోకుండా సలార్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కావడంతో అంచానాలు మాములుగా లేవు. ముందు ఆది పురుష్ రిలీజవుతుందా లేక సలార్ వస్తుందానే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ ఒకప్పటి మాస్ డార్లింగ్ ని ఇందులో చూసుకోవచ్చనే అంచనాలు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి.
అయితే ఇది ఒకే భాగమా లేక సీక్వెల్ కూడా ప్లాన్ చేశారా అనేది యూనిట్ గుట్టుగా ఉంచుతోంది. ఇక అసలు విషయానికి వస్తే సలార్ లో కమల్ హాసన్ విక్రమ్ తరహా క్లైమాక్స్ ట్విస్టు ఒకటి ప్లాన్ చేస్తున్నారని బెంగళూరు టాక్. ఆ సినిమా చివరిలో సూర్య పాత్ర రోలెక్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ నాలుగైదు నిమిషాలే ఎంత రచ్చ చేసిందో చూసాం.
కేవలం ఆ ఒక్క ఎపిసోడే సబ్జెక్ట్ ఎలివేషన్ ని పది రెట్లు పెంచిందనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడదే తరహాలో సలార్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్ తో పది నిమిషాల ఎపిసోడ్ ఒకటి ప్లానింగ్ లో ఉందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమో కాదో చెప్పడానికి అధికారిక రుజువు లేదు కానీ ప్రచారం జోరుగా ఉంది.
దీనికి ఊతమిచ్చేలా యష్ ఇంకా గెడ్డం తీయకపోవడం, హెయిర్ స్టైల్ ని అలాగే కొనసాగించడం పలు అనుమానాలు రేపుతోంది. దీని కోసమే అలా చేస్తున్నారన్న కామెంట్స్ లేకపోలేదు. ఇదంతా తేలడానికి నెలల సమయం పడుతుంది. మైన్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సలార్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎంత శాతం చిత్రీకరణ పూర్తయ్యిందనేది చెప్పడం లేదు కానీ సగానికి పైగానే ఫినిష్ చేశారని వినికిడి. వీలైనంత త్వరగా ఆ అప్డేట్స్ ఏవో మొదలుపెడితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు
This post was last modified on August 7, 2022 4:23 pm
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…