నిత్యామీనన్ డిజిటల్ ఎంట్రీ అదుర్స్!

వెబ్ సిరీస్ కోసం ఇండియన్ ఓటిటి ప్లాటుఫార్మ్స్ బాగానే ఫండింగ్ చేస్తున్నాయి. ప్రాంతీయ భాషలకు ఇంకా గిరాకీ ఏర్పడలేదు కానీ హిందీ వెబ్ సిరీస్ ఇప్పటికే బాగా పాపులర్ అయిపోయాయి. దీంతో పేరున్న నటీనటులే వాటిలో నటిస్తున్నారు. మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన అమెజాన్ సిరీస్ బ్రీత్ సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ ముఖ్య భూమిక పోషించాడు.

ఇందులో నిత్యా మీనన్ కూడా మెయిన్ క్యారెక్టర్ చేసింది. మిషన్ మంగళ్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నిత్య, ఇప్పుడీ సిరీస్ తో అక్కడ మరింత పాపులర్ కానుంది. ఈ సిరీస్ జులై 10 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనిపై ఇప్పుడు చాలా బజ్ నెలకొంది. ట్రైలర్ కు చాలా వేగంగా లక్షల కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది. అంచనాలను అందుకుంటే ఇది కూడా ఈ లాక్ డౌన్లో వచ్చి క్లిక్ అయిన సిరీస్ సరసన చేరుతుంది.